
ఎవరైనా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని అంటుంటుంటారు.

కానీ రాశీఖన్నా మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని హీరోయిన్ అయిపోయింది.

ఈ రోజు (నవంబర్ 30) రాశీఖన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.

ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ చిన్నది.. తొలుత సింగర్ అవ్వాలనుకుంది.

ఆ తర్వాత మనసు మారి ఐఏఎస్ అవ్వాలని ఫిక్సయింది. కానీ డెస్టినీ మరోవైపు తీసుకెళ్లింది.

కాలేజీ చదువుతున్న టైంలో పాకెట్ మనీ కోసం యాడ్స్‌కి కాపీ రైటర్‌గా చేసింది.

అలా అనుకోకుండా కొన్ని యాడ్స్‌లో నటించింది. అది ఈమె లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ అయింది.

హిందీ మూవీలో 'మద్రాస్ కేఫ్'తో నటిగా సినిమాల్లోకి వచ్చింది.

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ఇక్కడే సెటిలైపోయింది.

ఓవైపు యంగ్ హీరోలతో నటిస్తూనే అడపాదడపా పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది.

2013 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది.

కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు గతంలో ఓ బ్రేకప్ లవ్ స్టోరీ ఉందని చెప్పింది.

ఓ యంగ్ హీరోనే రాశీ ఖన్నా ప్రేమించిందని, కానీ తర్వాత వీళ్లిద్దరూ విడిపోయారని తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగులో 'తెలుసు కదా' అనే సినిమాలో రాశీ నటిస్తోంది. తమిళ, హిందీలోనూ తలో మూవీ చేస్తోంది.
















