Rashi Khanna Shocking Comments On South Industry: ‘మద్రాస్ కేఫ్’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ రాశీ ఖన్నా. తర్వాత ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అది హిట్ కావడంతో వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడే సెటిలైపోయింది. సుమారు 9 ఏళ్ల తర్వాత రుద్ర వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించింది రాశి. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తన ఈ వెబ్ సిరీస్ రుద్ర సక్సెస్ నేపథ్యంలో రాశి ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో దక్షిణాది పరిశ్రమవాళ్లు గ్యాస్ ట్యాంకర్ అంటూ తనని వెంకిరించారని గుర్తు చేసుకుంది.
చదవండి: ఇన్‌స్టాగ్రామ్ ఒక్కో పోస్ట్‌కి సమంత ఎంత తీసుకుంటుందో తెలుసా?
అంతేగాక సౌత్ ఇండస్ట్రీపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ.. తనకు రోటీన్‌గా ఉండటం నచ్చదని, కానీ దక్షిణాదిలో అడుగు పట్టాక దానికి అలవాటు పడిపోయానంది. ‘రోటీన్‌కు అలవాటు పడిపోయాను. తెలుగులో పలు కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ రోటిన్ ఫార్యులాతోనే ఉండిపోయాను. ఇలా సౌత్ ఇండస్ట్రీ క్రియేట్ చేసిన రోటీన్ ఫార్ములాలన్నింటిని దాటుకుంటూ వచ్చాను. ఇకపై నా కథల ఎంపికలో మార్పు ను. ఇప్పటి నుంచి నేను చేసే ప్రతీ సినిమాలో ఓ కొత్త రాశి ఖన్నాను చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది.
చదవండి: రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
అలాగే దక్షిణాదిన హీరోయిన్లను వారి ప్రతిభతో కాకుండా లుక్స్ పరంగా గుర్తింపు ఇస్తారంది. అభిమానులు హీరోయిన్లకు రకారకాల ట్యాగ్ ఇస్తుంటారని, అది తనకు అసలు నచ్చదని చెప్పింది. అక్కడ హీరోయిన్లను మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు.. కానీ అంతకు మించిన టాలెంట్ హీరోయిన్స్‌లో ఉంటుందని సౌత్ ప్రేక్షకులు, అభిమానులు గుర్తించాలని ఆమె పేర్కొంది. కాగా రుద్ర వెబ్ సిరీస్‌తో 9 ఏళ్ల తర్వాత బాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చిన రాశీకి దీనితో పాటు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోలతో జతకట్టనుంది. ఇక తెలుగులో రాశీ నాగచైతన్య సరసన థ్యాంక్యూ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment