ఎవరీ అండ లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగా: హీరోయిన్ | Rashi khanna Open About Cinema Chances In Industry | Sakshi
Sakshi News home page

Rashi khanna: భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించలేం: రాశీ ఖన్నా

Published Sun, Jun 4 2023 7:37 AM | Last Updated on Sun, Jun 4 2023 7:39 AM

Rashi khanna Open About Cinema Chances In Industry - Sakshi

హీరోయిన్ రాశిఖన్నా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. తెలుగు, తమిళంలోనూ పలలు చిత్రాల్లో నటించింది. హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రాశిఖన్నా మెడికల్‌ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అడంగామరు, అయోగ్య, సంఘ తమిళన్‌, తుగ్లక్‌ దర్భార్‌, తిరు చిట్రం ఫలం తదితర చిత్రాలలో నటించింది.

(ఇది చదవండి: రైలు ప్రమాద ఘటనతో నా గుండె పగిలింది: అల్లు అర్జున్)

ప్రస్తుతం సుందర్‌ సీ దర్శకత్వంలో రూపొందుతున్న అరణ్మణై –4 చిత్రంలో నటిస్తోంది. కాగా హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్న రాశిఖన్నా తన అందాలను తెరపై విచ్చలవిడిగా ఆరబోయడానికి ఏ మాత్రం వెనుకాడదు. కాగా ఇటీవల ఈ అమ్మడు తన సినీ అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.

తాను ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరీ అండ లేకుండానే ఈ రంగంలోకి ప్రవేశించానని చెప్పింది. అయినప్పటికీ నటిగా మంచి పేరు సంపాదించుకున్నానని తెలిపింది. ఇప్పటి వరకు నిలబెట్టుకుంటున్నానని పేర్కొంది. విజయాలు వచ్చినప్పుడు తన అదృష్టాన్ని నమ్మలేకపోయానని అయితే ఒకక నటిగా ఊహించిన విధంగానే అభిమానులను పొందానని చెప్పింది. నాలోని ప్రతిభను మనం ఎప్పుడు తక్కువ చేసుకోరాదన్నది తన భావన అని తెలిపింది. సినిమారంగం నిరంతరం కానిదని పేర్కొంది. ఇక్కడ కథానాయకిగా భవిష్యత్‌ ఎలా ఉంటుందో ఊహించలేమని.. ఇప్పుడు అవకాశాలు రావచ్చు.. ఆ తర్వాత దారెటు తెలియకపోవచ్చు అని రాశిఖన్నా పేర్కొంది.

(ఇది చదవండి: బెడ్‌రూమ్‌లో కెమెరా.. నన్ను టార్చర్‌ పెట్టాడు: మాజీ భర్తపై నటి ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement