
చాలామంది నటించడం ఈజీ అనుకుంటారు. ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు హావభావాలు ఒలికించడాన్నే నటన అని భావిస్తారు. కానీ కొన్ని సమయాల్లో, మరికొన్ని సీన్లలో నటించడం అనుకున్నంత ఈజీ కానే కాదు. ముఖ్యంగా బెడ్‌రూమ్ సీన్లలో హీరోయిన్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందే రాశీ ఖన్నా కూడా ఎదుర్కొంది. అంతేకాదు ఆమెను అలాంటి పరిస్థితిలో చూసి రాశీ తల్లి కూడా ఎంతో భయపడిపోయింది.
రాశీ ఖన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో జరిగిన విషయమిది... హిందీలో ఆమె తొలి చిత్రం 'మద్రాస్ కెఫె'లో ఓ అభ్యంతరకర సీన్‌లో నటించాల్సి వచ్చింది. అది కేవలం నటనే అయినప్పటికీ మరో వ్యక్తితో ఒకే బెడ్‌పై ఉండటం అన్న ఆలోచననే రాశీ ఖన్నా జీర్ణించుకోలేకపోయింది. తన భయాన్ని పోగొట్టుకునేందుకు ఆ సన్నివేశం గురించి తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె తల్లికి ఆ రోజంతా నిద్ర పట్టలేదు.
ఇక సెట్స్‌కు వచ్చిన తర్వాత ఎలాగోలా ఆ సీన్ షూటింగ్ పూర్తి చేసిన రాశీ ఆ వెంటనే వ్యాన్‌లోకి వెళ్లిపోయి వెక్కి వెక్కి ఏడ్చిందట. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోనూ ఇలాంటి ఓ అభ్యంతరకరమైన సీన్‌లో నటించాల్సి వచ్చింది. కానీ అప్పుడు విజయ్ ఆమెకు ధైర్యం చెప్పి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీన్ పూర్తి చేశారట. ఇక అప్పటి నుంచి ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు పాత్ర నుంచి తనను తాను వేరు చేసుకోవడం ఎలాగో నేర్చేసుకున్నానంటోంది రాశీ ఖన్నా.
Comments
Please login to add a commentAdd a comment