‘మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి’ అన్న మాటను తు.చ. తప్పకుండా పాటిస్తున్న హీరోయిన్స్‌లో రాశీ ఖన్నా ఒకరు. వెండితెరకే పరిమితం కాకుండా.. వెబ్‌తెర మీదా దూసుకుపోతున్న ఆమె గురించి కొన్ని వివరాలు.. రాశీ ఖన్నా సొంతూరు ఢిల్లీ. సెయింట్ మార్క్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్లో స్కూలింగ్, లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
చదువులో మెరుగైన విద్యార్థి. కాలేజ్ టాపర్ కూడా. సింగర్ కావాలన్నది ఆమె కల. కొంతకాలం సంగీతంలోనూ శిక్షణ తీసుకుంది. అయితే, అనుకోకుండా ఓ షాపింగ్ మాల్లో ఫ్రీగా వచ్చే ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ కోసం దిగిన సెల్ఫీ.. ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చింది. తొలి చిత్రం ‘మద్రాస్ కేఫ్’. అందులో ఆమెది చిన్న పాత్రే అయినా, మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ విజయంతో బిజీ అయిపోయింది.
‘సుప్రీమ్’, ‘జై లవకుశ’, ‘తొలిప్రేమ’, ‘వెంకీ మామ’, ‘పక్కా కమర్షియల్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి తెలుగు సినిమాలతో పాటు, ‘సర్దార్’, ‘మేధావి’, ‘సైతాన్ కీ బచ్చా’ వంటి పలు తమిళ సినిమాల్లోనూ నటించి, మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం రాశీ.. బాలీవుడ్‌తో పాటు వెబ్‌దునియా పట్లా దృష్టి సారించింది.
సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హిందీలో ‘యోధ’ అనే చిత్రంలో నటిస్తోంది. డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లోని ‘రుద్ర’ సిరీస్‌తో వెబ్ వరల్డ్‌లోకి ఎంటర్ అయి.. అక్కడా ఖాళీ లేని కాల్షీట్స్‌తో బిజీగా మారింది. రాశీ నటించిన ‘ఫర్జీ’ అనే మరో వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‌లో ఉంది ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో!
Comments
Please login to add a commentAdd a comment