
విజయ్ దేవరకొండ
‘‘ప్రేమంటే సర్దుకుపోవడం గౌతమ్. ప్రేమంటే త్యాగం. ప్రేమలో ఒక దైవత్వం ఉంటుంది. ఇవేవీ నీలో కనపడట్లేదు’ అని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం టీజర్‌లో విజయ్ దేవరకొండతో రాశీ ఖన్నా అంటున్నారు. ఈ టీజర్ శుక్రవారం విడుదలైంది. ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్, ఇజబెల్లా హీరోయిన్లు. కేయస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించారు. టీజర్‌లో నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ కనిపించారు విజయ్. మరి సినిమాలో నాలుగు షేడ్స్‌లో కనిపిస్తారా? ద్విపాత్రాభినయం చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రేమికుల దినోత్సవానికి ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.