తమిళ సినిమా: మంచి ఫిజిక్. అంతకు మించిన యాక్టివ్. యువతను గిలిగింతలు పెట్టగల యాక్టింగ్ ఇవన్నీ నటి రాశి ఖన్నాలోని లక్షణాలు. అంతేకాకుండా తనదైన అందాలతో కనువిందు చేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ పాపులర్ అయిన రాశీ ఖన్నాకు కథానాయకిగా ఇంకా తాను ఆశించిన స్థాయి రాలేదనే చెప్పాలి. అలాంటి స్థాయికి చేరుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవల నటిగా కాస్త వెనుకపడిందనే చెప్పాలి.
తమిళంలో ఈమె నటించిన చివరి చిత్రం సర్దార్. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం హిందీలో యోధా అనే ఒక చిత్రం, తమిళంలో అరణ్మణై 4, మేథావి చిత్రాల్లో నటిస్తోంది. కాగా తరచూ తన గ్రామ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ నెటిజన్లను కవ్విస్తున్న రాశీఖన్నా ఇకపై రానున్నవన్నీ ఆనంద క్షణాలే అని పేర్కొంది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను ఇప్పుడు పండగల ఖుషిలో ఉన్నట్లు పేర్కొంది.
నవరాత్రి వేడుకలు మొదలయ్యాయని.. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తానని చెప్పింది. నవరాత్రి వేడుకలు పూర్తికాగానే దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటానని, తనకు దీపావళి చాలా పెద్ద పండుగ అని పేర్కొంది. ఆ సమయంలో పటాసులు కాల్చడం చాలా సరదా చెప్పింది. అదేవిధంగా నూతన దుస్తులు ధరించి తీపి పదార్థాలను తింటానని తెలిపింది. ఆ తర్వాత నవంబర్ 30వ తేదీ తన పుట్టినరోజు అని ఆ వేడుకను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత క్రిస్మస్, ఆంగ్ల ఉగాది పర్వదినాలు వస్తాయని అలా ఈ మూడు నెలలు తనకు ఆనంద క్షణాలే అని నటి రాశి ఖన్నా సంతోషం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment