దక్షిణాదిలో పదేళ్లుగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు రాశీ ఖన్నా. అలాగే ‘రుద్ర’ సిరీస్‌తో వెబ్ వరల్డ్‌లోకి ఎంటర్ అయిన రాశీ తాజాగా ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌లో ఓ లీడ్ రోల్ చేశారు. రాజ్ అండ్ డీకేలు తెరకెక్కించిన ఈ సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రెజీనా ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ నెల 10 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లా ట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు.
‘ఫర్జీ’లో మీ పా త్రకు వచ్చిన అభినందనల గురించి...
ఈ సిరీస్‌లో నేను చేసిన మేఘా వ్యాస్ పాత్రకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభిస్తున్నందుకు హ్యాపీ. సామ్ (సమంత), కీర్తీ సురేష్ బాగుందంటూ మెసేజ్‌లు పెట్టారు. వీరితోపా టు కొందరు దర్శక–నిర్మాతలు కూడా కంగ్రాట్స్ చెప్పారు. తెలుగు, తమిళ ఆడియన్స్ నుంచి కూడా పా జిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుతం మీ చేతిలో ఎక్కువ సినిమాలు లేవు. అయితే మీరు కొత్త సినిమాలు ఒప్పుకోనిది పెళ్లి చేసుకోవడం కోసమే అని కొందరు అనుకుంటున్నారు...
సినిమాలకు నేను బ్రేక్ ఇవ్వలేదు. తెలుగులో మూడు, తమిళంలో మూడు కథలు విన్నాను. అవి చర్చల దశలో ఉన్నాయి. ‘ఫర్జీ’ రిలీజ్ తర్వాత ఓ నిర్ణయం తీసుకుందామని వెయిట్ చేశాను.. అంతే. త్వరలో నా కొత్త సినిమా ప్రకటనలు వస్తాయి.
హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’ (2013)తో కెరీర్ ప్రారంభించిన మీరు ఆ తర్వాత మరో హిందీ సినిమా చేయడానికి పదేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణం?
తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అందువల్ల నేను దక్షిణాది సినిమాలకే స్టక్ అయిపోయాను. నిజానికి కెరీర్‌లో ఏం చేయాలి అని నేను ప్లాన్ చేసుకోలేదు. ఓ ఫ్లో ప్రకారం వెళ్లిపోయాను. ఇప్పుడు ఏదో హిందీ సినిమా చేయాలని ‘యోధ’ ఒప్పుకోలేదు. కథ నచ్చడంతో ‘యస్’ చెప్పా. ఓటీటీ ప్రభావంతో భాషపరమైన హద్దులు కూడా లేవు. తెలుగు, హిందీ అని కాదు.. ప్రతిదీ ఇండియన్ సినిమానే. ప్రస్తుతం ‘యోధ’ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఇటీవల కొందరు హీరోయిన్లు అనారోగ్యం బారిన పడటానికి వృత్తిపరమైన ఒత్తిడి ఓ కారణం అనుకోవచ్చా? ఒకవేళ మీకు ఒత్తిడి ఉంటే దాన్ని ఎలా అధిగమిస్తారు?
నిజం చెప్పాలంటే నా కెరీర్‌ను నేనెప్పుడూ ప్రెజర్‌గా ఫీల్ కాలేదు. సాధారణ పాత్ర చేసినప్పుడు మాత్రమే కాదు.. చాలెంజింగ్ రోల్ చేసినప్పుడూ కూల్‌గానే ఉంటాను. ఎందుకంటే యాక్టింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక హెల్త్ విషయానికొస్తే.. నేను ఆరోగ్యంగా, హ్యాపీగా ఉన్నాను. దీన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను.
మీకు డ్రీమ్ రోల్స్ ఏమైనా?
తెలుగులో నేను లవ్‌స్టోరీ సినిమాలు చేశాను. కామెడీ రోల్స్ చేశాను. ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉంది. ‘బాహుబలి’లో అనుష్కగారు చేసిన యువరాణిలాంటి పాత్ర చేయాలని ఉంది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసే ఏ పా త్రనైనా నేను డ్రీమ్ రోల్‌లానే భావిస్తాను.
ఓ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొత్తగా సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలకు మీరు ఇచ్చే సలహా?
నా లైఫ్‌లో నేను టైమ్‌కి చాలా ప్రా ధాన్యం ఇస్తాను. ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టపడే తత్త్వం, క్రమశిక్షణ చాలా ముఖ్యం. అలాగే ఏ ఇండస్ట్రీకి వెళ్లినా అక్కడి భాషను నేర్చుకోవాలి.
Raashii Khanna: అనుష్క చేసినటువంటి పాత్ర చేయడమే నా డ్రీమ్‌రోల్..
Published Fri, Feb 17 2023 2:31 AM | Last Updated on Fri, Feb 17 2023 8:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment