
కొత్త సంవత్సరంలో కొత్త చిత్రం షూటింగ్‌లోకి అడుగుపెట్టారు రాశీఖన్నా. అది కూడా హిందీ సినిమా. ఇప్పటికే హిందీలో రెండు వెబ్ సిరీస్‌లు (అజయ్ దేవగన్, షాహిద్ కపూర్‌లతో..) పూర్తి చేసిన రాశీఖన్నా ఇటీవల హిందీ చిత్రం ‘యోధ’లో హీరోయిన్‌గా నటించే చాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. దర్శక ద్వయం సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు రాశీఖన్నా. దిశా పటానీ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది నవంబరు 11న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... రాశీఖన్నా కెరీర్‌ను స్టార్ట్ చేసింది 2013లో వచ్చిన హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’తోనే. ఆ తర్వాత హిందీలో ఆమె సినిమాలు చేయలేదు. సౌత్ సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ హిందీ సినిమా చేస్తున్నారామె.
Comments
Please login to add a commentAdd a comment