హాంకాంగ్: భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు ఆచంట శరత్ కమల్, మౌమదాస్‌లు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. శనివారం జరిగిన ఆసియా ఒలింపిక్ గేమ్స్ క్వాలిఫికేషన్ స్టేజ్-2లో పోటీల్లో శరత్ 4-3 (12-14, 11-6, 3-11, 7-11, 11-4, 11-6)తో నోషాద్ అల్మియాన్ (ఇరాన్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ ఫైనల్ రౌండ్‌లో మౌమదాస్ 0-4 (3-11, 9-11, 10-12, 5-11)తో రి మైయోంగ్ సన్ (ఉత్తర కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. అయితే లూజర్స్ ఫైనల్స్‌లో (ఓడిపోయిన వారి మధ్య జరిగే ఫైనల్స్) మౌమ 4-1 (11-13, 11-9, 13-11, 11-7, 12-10)తో గుఫ్రనోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచి బెర్త్‌ను ఖాయం చేసుకుంది.