
కామన్వెల్త్ క్రీడల ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ మూడో పతకం (పురుషుల హై జంప్‌లో తేజస్విన్ యాదవ్ కాంస్యం, లాంగ్ జంప్‌లో శ్రీశంకర్ మురళీ రజతం) సాధించింది. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ చేజిక్కించుకుంది.
43 నిమిషాల 38 సెకెన్లలో రేస్‌ను ముగించి ప్రియాంక.. కెరీర్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు కామన్‌వెల్త్ క్రీడల రేస్ వాకింగ్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. ప్రియాంక సాధించిన పతకంతో భారత పతకాల సంఖ్య 27కు (9 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కంస్యాలు) చేరింది.
మరోవైపు తొమ్మిదో రోజు బాక్సింగ్‌లోనూ భారత్ హవా కొనసాగింది. మహిళల 48 కేజీల విభాగంలో నీతూ గంగస్ కెనడాకి చెందిన ప్రియాంక దిల్లాన్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల 51 కేజీల విభాగం సెమీ ఫైనల్‌లో అమిత్ పంగల్.. జాంబియా బాక్సర్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దీంతో ఆయా విభాగాల్లో భారత్‌కు రెండు పతాకలు ఖరారయ్యాయి.
చదవండి: CWG 2022: 9వ రోజు భారత షెడ్యూల్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment