These Amazing Foods in Your Diet Help Fight Deficiency of Anemia - Sakshi
Sakshi News home page

Health Tips: రోజూ నిమ్మకాయ పులిహోర, ఎండు ద్రాక్ష, ఖర్జూర తింటున్నారా!

Dec 4 2021 2:39 PM | Updated on Dec 4 2021 7:24 PM

These Amazing Foods In Your Diet Help Fight Deficiency Of Anemia - Sakshi

These Amazing Foods In Your Diet Help Fight Deficiency Of Anemia: భారతీయ మహిళను వేధిస్తున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య ఎనీమియా. రక్తహీనతను అనారోగ్యంగా పరిగణించకుండా అజాగ్రత్తగా రోజులు గడిపేస్తుంటారు కూడా. నిజానికి ఇది అనేక రకాలుగా ప్రాణాపాయానికి కారణమవుతుందని గమనించాలి.  ఎప్పుడూ అలసటగా అనిపించడం, చర్మం నిర్జీవంగా, తెల్లగా పాలిపోవడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, నిస్సత్తువ, గుండె వేగం ఉన్నట్లుండి పెరిగిపోవడం, శ్వాస దీర్ఘంగా తీసుకోలేకపోవడం, దేని మీదా ఆసక్తి లేకుండా నిరాసక్తంగా ఉండడం... ఇవన్నీ రక్తహీనత కారణంగా కనిపించే ప్రధాన లక్షణాలు.

రక్తహీనత ఉన్నప్పుడు దేహంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించి తరచుగా అంటువ్యాధులు దాడి చేస్తుంటాయి. రక్తహీనత అంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం. ఐరన్‌లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఐరన్‌ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. 

‘సి’ విటమిన్‌ ఉన్న ఆహారం తీసుకోవాలి.


నిమ్మ, నారింజ, బత్తాయి రసాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగాలి. నిమ్మకాయ పులిహోర వంటి వంటకాలను డైలీ మెనూలో చేర్చుకోవాలి.


సీ విటమిన్‌ తగినంత లేకపోతే ఆహారంలో తీసుకున్న ఐరన్‌ను దేహం గ్రహించలేదు. కాబట్టి ఆకు కూరల్లో నిమ్మరసం కలుపుకుని తినడం మంచిది.


రక్తహీనతతోపాటు కఫం తో కూడిన దగ్గు కూడా ఉంటే రోజూ ఉదయం సాయంత్రం కప్పు పెరుగును టీ స్పూన్‌ స్వచ్ఛమైన పసుపుతో కలిపి తీసుకోవాలి.

దానిమ్మ, బీట్‌రూట్‌లు రక్తవృద్ధితోపాటు రక్తశుద్ధిని కూడా చేస్తాయి. వీటిని అలాగే తినడం లేదా రసం తాగడం వల్ల ఓ వారంలోనే మంచి ఫలితాలు కలుగుతాయి.


నువ్వులను ఏదో ఒక రూపంలో రోజూ తీసుకోవాలి.


నువ్వులను రెండు–మూడు గంటల సేపు నానబెట్టి మెత్తగా పేస్ట్‌ చేసుకుని అందులో తేనె కలుపుకుని తినవచ్చు.
నువ్వులు– బెల్లంతో చేసిన లడ్డు తినవచ్చు. నువ్వుల పొడి చేసుకుని కూరల్లో, అన్నంలో కలుపుకోవచ్చు.
రోజూ గుప్పెడు ఎండుద్రాక్ష, రెండు ఎండు ఖర్జూరాలు తింటే చాలు. రక్తహీనత నుంచి సులువుగా బయటపడవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement