ఎనర్జీ బాల్స్ తయారీకి కావల్సినవి:
రాగిపిండి – అరకప్పు
మునగ ఆకు పొడి – ముప్పావు కప్పు
ఎండిన అంజీర పండ్లు – ఆరు
కర్జూరం – పన్నెండు
కిస్‌మిస్ –పావు కప్పు, జీడిపప్పు – పావు కప్పు
బాదం – పావు కప్పు, పిస్తా – పావు కప్పు
ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు,బెల్లం పొడి – పావు కప్పు
యాలకుల పొడి – టీస్పూను; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు;
ఎండు కొబ్బరి పొడి – రెండు టేబుల్ స్పూన్లు (గార్నిష్‌కు సరిపడా).
ఎనర్జీ బాల్స్ తయారీ విధానమిలా..
అంజీర పండ్లు, కర్జూరం విత్తనాలు తీసేసి వేడినీటిలో పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి. బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి రాగిపిండి వేసి వేయించాలి. రాగిపిండి మంచి వాసన వస్తున్నప్పుడు మునగాకు పొడి వేసి ఐదు నిమిషాలు వేయించి తీసేయాలి. ఇదే బాణలిలో డ్రైఫ్రూట్స్ అన్నింటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
చివరగా ఎండు కొబ్బరిని కూడా వేయించుకోవాలి. వేయించిన డ్రైఫ్రూట్స్‌ను మిక్సీజార్‌లో వేసి పొడిచేసుకోవాలి. నానబెట్టిన కర్జూరం, అంజీరను పేస్టులా గ్రైండ్ చేయాలి. బాణలిలో మరో టేబుల్ స్పూను నెయ్యివేసి అంజీర పేస్టుని వేసి సన్నని మంట మీద నెయ్యి పైకి తేలేంత వరకు వేయించాలి.
వేగాక డ్రైఫ్రూట్స్ పొడి, రాగి, మునగాకు, యాలక్కాయ బెల్లం పొడులు వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత పిండి మిశ్రమాన్ని లడ్డులా చుట్టుకుని కొబ్బరి పొడిలో అద్దుకుంటే ఎనర్జీ బాల్స్ రెడీ. గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే పదిహేను రోజులపాటు తాజాగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment