![ఇంటిప్స్](/styles/webp/s3/article_images/2017/09/4/51476380174_625x300.jpg.webp?itok=GJkQLCRO)
ఇంటిప్స్
నిమ్మకాయలు ఎండిపోయి గట్టిపడితే, కొద్దిగా వేడినీళ్లలో అయిదు నిమిషాలు ఉంచి తీస్తే మెత్తగా అవుతాయి. గంటసేపు డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రిడ్జ్‌లో ఉంచి, చాకుని వేడి నీటిలో ముంచి డ్రై ఫ్రూట్స్‌ని కట్ చెయ్యాలి.కూరగాయలను ఉడకబెట్టిన నీటిని వంపేయకుండా గ్రేవీలో గాని, సూప్‌లో గాని, సాంబార్‌లో జత చేయాలి. ఇలాచేస్తే టేస్ట్‌తోపాటుగా విటమిన్స్ కూడా అందుతాయి.
పాలు కాచే పాత్రలో ఒక స్పూన్‌ని ఉంచి, చిన్న మంట మీద పాలు కాస్తే పొంగకుండా ఉంటాయి.ఆకు కూరలను నేరుగా కవర్లలో భద్రపరచకుండా న్యూస్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. పచ్చిమిర్చి తొడిమలు తుంపి, ఫ్రిడ్జ్‌లో ఉంచితే త్వరగా పాడవ్వకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.