బాటిల్‌లో భోజనం! | meals in bottle | Sakshi
Sakshi News home page

బాటిల్‌లో భోజనం!

Published Mon, Aug 1 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

బాటిల్‌లో భోజనం!

బాటిల్‌లో భోజనం!

 టెక్ టాక్


ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండు వేల కేలరీల ఆహారం అవసరమని.. ఇందులో అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండాలని శాస్త్రం చెబుతోంది. మరి... ఇలాంటి ఆహారం ఎక్కడ దొరుకుతుందీ అంటే మా సూపర్ డ్రింక్ ట్రై  చేయండి అంటోంది శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆంపుల్ మీల్స్’ సంస్థ. ఆహారం పేరు చెప్పి డ్రింక్ గురించి చెబుతున్నారేమిటని ఆశ్చర్యపోకండి. ఇక్కడ అవి రెండూ ఒక్కటే. ఎందుకంటే ఆంపుల్‌మీల్స్ ఒకపూట భోజనంలో ఉండాల్సినన్ని ఆరోగ్యకరమైన అంశాలన్నింటినీ  బాటిల్‌లోకి చేర్చేసింది మరి! మనం చేయాల్సిందల్లా ఈ బాటిల్‌లోకి కొన్ని నీళ్లు/పాలు చేర్చుకోవడం... బాగా కదిలించి గొంతులోకి దింపేసుకోవడమే!

చిలగడదుంపల నుంచి గుమ్మడి విత్తనాల వరకూ పాలకూర నుంచి అరటిపండు వరకూ అన్ని రకాల ఆహార పదార్థాల్లోని పోషకాలను దీంట్లో మేళవించారు. కొవ్వుల కోసం ఏమేం కలిపారో, ప్రొటీన్ల కోసం వాడినవి ఏమిటో... ఈ బాటిల్‌పైన ఉంటాయి. మీ శారీరక అవసరాలను బట్టి 400, 600 కిలో కేలరీల విభాగాల్లో దొరుకుతోంది ఈ సూపర్ డ్రింక్. వంట తంటా లేకుండా ఆరోగ్యకరమైన ఆహారమన్నమాట!
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement