శరీరానికి మేలు చేసే హెచ్‌డీఎల కొవ్వు మోతాదును ఎక్కువ చేసేందుకు సిడ్నీలోని యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన మార్గాన్ని ఆవిష్కరించారు. కొవ్వు తగ్గించేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులన్నీ ఎల్‌డీఎల్ కొవ్వుపై మాత్రమే పనిచేస్తూండగా... హెచ్‌డీఎల్‌ను పెంచే మందులేవీ మార్కెట్‌లో లేవు. అయితే ఓఆర్‌పీ2 అనే ప్రొటీన్ కొవ్వును ఒక కణం నుంచి ఇంకోదానికి సరఫరా చేస్తున్నట్లు సిడ్నీ శాస్త్రవేత్తలు గుర్తించడంతో ఈ పరిస్థితిలో మార్పు రానుంది.
కణం లోపలి భాగాల్లో ఉండే కొవ్వును ఈ ప్రొటీన్ ఉపరితలం పైకి తీసుకొస్తుందని.. కణం స్థిరంగా ఉండేందుకు ఈ కొవ్వు ఉపయోగపడుతుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రాబ్ యాంగ్ అంటున్నారు. ఈ కారణంగానే శరీరంలోని 90 శాతం కొవ్వు కణాల ఉపరితలం పైనే కనిపిస్తుందని వివరించారు. శరీరానికి మంచి చేసే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను కణ త్వచం తయారుచేస్తూంటుందని కణంలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు అందులో కొంత ఇలా హెచ్‌డీఎల్‌గా మారుతుందని తెలిపారు. ఓఆర్‌పీ ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా ఎక్కువ మోతాదులో కొవ్వు త్వచాన్ని చేరేట్టు చేయవచ్చునని... తద్వారా హెచ్‌డీఎల్ ఉత్పత్తి ఎక్కువవుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment