
శరవేగ భారనారి
శరీరం బెలూన్‌లా ఊరిపోతుంటే, మామూలు మానవులెవరైనా తెగ బెంగపెట్టేసుకుని
తిక్క లెక్క
శరీరం బెలూన్‌లా ఊరిపోతుంటే, మామూలు మానవులెవరైనా తెగ బెంగపెట్టేసుకుని, బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఒంట్లోని కొవ్వు కరిగించుకోవడానికి నానా తంటాలు పడతారు. అయితే, డోనా సింప్సన్ అనే ఈ అమెరికన్ అమ్మడిదంతా రివర్స్ గేర్. ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా రికార్డు సాధించాలనే సంకల్పంతో ప్రయత్నం మొదలుపెట్టింది. రోజుకు ఏకంగా 20 వేల కేలరీల ఆహారాన్ని స్వాహా చేసేయసాగింది.
ప్రయత్నం మొదలుపెట్టిన రెండేళ్ల వ్యవధిలోనే విపరీతంగా బరువు పెరిగింది. 27 ఏళ్ల వయసులో ఆమె బరువు 158 కిలోలు ఉంటే, 31 ఏళ్ల వయసులో 2009 నాటికి 273 కిలోలకు చేరింది. మొత్తానికి అత్యంత బరువైన మహిళ రికార్డును దక్కించుకోలేకపోయినా, అత్యంత వేగంగా బరువు పెరిగిన మహిళగా గిన్నిస్ రికార్డు సాధించింది.