అనుష్కకు అమెరికాలో ఆపరేషన్? | Anushka Shetty to undergo a weight loss therapy in US before shooting for 'Baahubali 2'? | Sakshi
Sakshi News home page

అనుష్కకు అమెరికాలో ఆపరేషన్?

Published Wed, Oct 28 2015 3:32 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

అనుష్కకు అమెరికాలో ఆపరేషన్? - Sakshi

అనుష్కకు అమెరికాలో ఆపరేషన్?

తమిళసినిమా : కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. నటి అనుష్క ఆపరేషన్ చేయించుకునేందుకు అమెరికాకు వెళుతున్నట్లు చర్చ నడుస్తోంది. అందానికి మారుపేరు అనుష్క. పరిశ్రమలో ఈ బ్యూటీకున్న మరో పేరు స్వీటీ. ఇక నటిగా తనకు తానే సాటి. ఒక అరుంధతి, ఒక రుద్రమదేవి ఇవి చాలు అనుష్క నట సాఫల్యానికి. తాజాగా ఇంజి ఇడుప్పళగి చిత్రంలో అనుష్కను మరో యాంగిల్‌లో చూడబోతున్నాం. ఈ యాంగిల్ కోసం అనుష్క చాలా పెద్ద సాహసమే చేశారు. తన శరీర బరువును సుమారు 100 కిలోల వరకూ పెంచుకున్నారు.

ఇంతకంటే రిస్కేముంటుంది. అవును ఇది పెద్ద రిస్క్ అని అనుష్కకు ఇప్పుడర్థమైంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరోసైజ్) చిత్రం బాగా వచ్చిందంటున్నారు. ఆ విషయం పక్కనపెడితే ఈ చిత్రం కోసమే పెంచిన బరువు అనుష్కకిప్పుడు భారంగా మారింది. ఆమె నటించిన బాహుబలి చిత్రానికి సీక్వెల్ మొదలవుతోంది.

ఇందులో సన్నగా నాజూగ్గా ఉండాలని ఆ చిత్ర సృష్టికర్త రాజమౌళి చెప్పినట్లు సమాచారం. దీంతో యోగా టీచర్ అయిన అనుష్క బరువు తగ్గటానికి యోగా ఫీట్స్ మొదలెట్టినా పెద్దగా ఫలితం లేకపోవడంతో అమెరికాలో కొవ్వు తగ్గించే శస్త్ర చికిత్స చేయించుకోవలసిందిగా కొందరు సన్నిహితులు సలహా ఇచ్చారట. శస్త్ర చికిత్స వల్ల కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని అనుష్క ఆలోచిస్తున్నారట. త్వరగా బరువు తగ్గడానికి మరేదయినా దారి ఉందా? అని ఆలోచిస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement