కొవ్వు పదార్థాలు తింటే లావెక్కిపోతామనే భయంతో చాలామంది అన్నంలో కాస్త నెయ్యి కలుపుకోవడానికి కూడా భయపడుతుంటారు. కొవ్వు పదార్థాలను మితిమీరి తీసుకోవడం వల్ల స్థూలకాయం మొదలుకొని గుండెజబ్బుల వరకు నానా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయనేది వాస్తవమే కాని, అన్ని రకాల కొవ్వు పదర్థాలూ ఆరోగ్యానికి చేటు తెచ్చిపెట్టేవి కాదు. సమతుల ఆహారంలో కొవ్వులు కూడా అవసరమైన పదార్థాలే. వీటిలో కొన్ని కొవ్వులు ఒంటికి మేలు చేస్తాయి కూడా. పాల ఉత్పత్తుల్లో లభించే కొవ్వులను మేలు చేసే కొవ్వులుగానే పరిగణించాలని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. వెన్న, నెయ్యి, చీజ్, పెరుగు, మీగడ వంటి పాల ఉత్పత్తుల్లోని కొవ్వుల వల్ల గుండెజబ్బులు తలెత్తే ప్రమాదమేమీ ఉండదని అమెరికాలోని టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
నిజానికి పాల ఉత్పత్తుల్లోని కొవ్వులు శరీరానికి చాలా మేలు చేస్తాయని, కొవ్వులతో కూడిన పాల ఉత్పత్తులను తరచు తీసుకుంటున్నట్లయితే పక్షవాతం సోకే ముప్పు 42 శాతం మేరకు తగ్గుతుందని తమ పరిశోధనలో తేలిందని టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ మార్షియా ఓట్టో వెల్లడించారు. పాల ఉత్పత్తుల్లో లభించే కొవ్వుల్లో వాపులను తగ్గించే లక్షణం ఉంటుందని, ఇవి అధిక రక్తపోటును నిరోధిస్తాయని ఆయన వివరించారు. పాల ఉత్పత్తులు, వాటి ప్రత్యామ్నాయాలపై రెండు దశాబ్దాల పాటు నిర్వహించిన సుదీర్ఘ పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి రావడం విశేషం.
పాల ఉత్పత్తుల్లోని కొవ్వు మంచిదే!
Published Tue, Jul 17 2018 12:13 AM | Last Updated on Tue, Jul 17 2018 12:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment