Fatty substances
-
ఫ్యాటీలివర్ అంటున్నారు.. సలహా ఇవ్వండి
నా వయసు 58 ఏళ్లు. ఇటీవల జనరల్ హెల్త్ చెకప్‌లో భాగంగా స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. లివర్ కొవ్వు పదార్థాలను గ్రహించి అవి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంటుంది. అయితే కాలేయం కూడా కొన్ని రకాల కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించే ఫ్యాటీలివర్. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా కాలేయంలో నిల్వవున్న కొవ్వుల వల్ల కాలేయానికి గానీ, దేహానికి గానీ 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అది లివర్ సిర్రోసిస్ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్ రావచ్చు. అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు. మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... ∙మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ∙మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి ∙లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు కూడా వాడవచ్చు ∙తరచూ చేపమాంసాన్ని అంటే వారానికి 100–200 గ్రాములు తీసుకోవడం మంచిది ∙మటన్, చికెన్ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సిరావచ్చు. కడుపులో మంట... పరిష్కారం చెప్పండి నా వయసు 42 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి కడుపులోనూ, ఛాతీభాగంలోనూ మంటతో బాధపడుతున్నాను. యాంటాసిడ్ సిరప్ తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వగలరు. మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి... ►మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం ►కాఫీ, టీలను పూర్తిగా మానేయడం ►పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం ►బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడం ►భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి ►తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి. ►పై సూచనలతో పాటు మీ డాక్టర్ సలహా మీద పీపీఐ డ్రగ్స్ అనే మందులు వాడాలి. అప్పటికే తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. గాల్ బ్లాడర్‌లో రాళ్లు...సలహా ఇవ్వండి నేను నెల రోజుల క్రితం కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నారు. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వగలరు. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు అసింప్టమాటిక్ గాల్‌స్టోన్ డిసీజ్ ఉన్నదని చెప్పవచ్చు. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉండి వ్యాధి లక్షణాలు లేనివారి ఓ ఏడాదికి నూటికి ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. కాబట్టి మీకు వ్యాధి లక్షణాలు లేకుండా ఉంటే, ఆపరేషన్ అవసరం లేదు. మీరు ఒకసారి మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి, మీ రిపోర్టులు చూపిస్తే సరైన సలహా ఇవ్వగలరు. తరచూ కడుపునొప్పి..మందులు వేసుకుంటేనే తగ్గుతోంది.. నా వయసు 37 ఏళ్లు. గత కొన్ని నెలలుగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. మల విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. కొన్నిసార్లు మలబద్ధకం, మరికొన్నిసార్లు విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. మీరు రాసిన లక్షణాలను బట్టి మీరు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన చెందుతుండే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్ అని వస్తే మీకు ఐబీఎస్ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య తగ్గుతుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, బంజారా హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
కొబ్బరినూనె కొవ్వులతో కీటకాలు పరార్!
కొబ్బరి నూనె నుంచి తీసిన కొన్ని పదార్థాలు కీటకాలను నాశనం చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయని అమెరికా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కీటకాలతో వచ్చే సమస్యలను అరికట్టేందుకు దాదాపు 60 ఏళ్లుగా డీట్ అనే కృత్రిమ రసాయనాన్ని వాడుతూండగా.. సహజసిద్ధమైన వాటి కోసం ఇటీవలే అన్వేషణ మొదలైంది. ఈ నేపథ్యంలో అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేపట్టారు. వీటి ప్రకారం కొబ్బరి నుంచి సేకరించిన కొన్ని రకాల కొవ్వు పదార్థాలు నల్లులతోపాటు, దోమలు, ఈగల నుంచి రక్షణ కల్పించడంలో కృత్రిమ రసాయనాల కంటే మెరుగైనవని తెలిసింది. మరీ ముఖ్యంగా దోమల విషయంలో ఈ పదార్థాలు ఎక్కువ ప్రభావశీలంగా కనిపించాయని, ల్యాబొరేటరీ పరిశోధనల్లో ఈ కొవ్వులు కొన్నిరకాల కీటకాల నుంచి రెండు వారాలపాటు రక్షణ కల్పించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జున్ వీ ఝూ అంటున్నారు. కొబ్బరి నూనె నేరుగా కీటకాలను పారదోలదని స్పష్టం చేసిన జున్ వీ ఝూ ఇందులోని లారిక్, క్యాప్రిక్, క్యాప్రిలిక్ యాసిడ్లు, వీటి తాలూకు మిథైల్ ఈస్టర్లు ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ రకమైన కొవ్వుల ఆధారంగా కొత్తరకం మందులు తయారు చేయడం వల్ల జికా వంటి అనేక వ్యాధులను నియంత్రించ వచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
పాల ఉత్పత్తుల్లోని కొవ్వు మంచిదే!
కొవ్వు పదార్థాలు తింటే లావెక్కిపోతామనే భయంతో చాలామంది అన్నంలో కాస్త నెయ్యి కలుపుకోవడానికి కూడా భయపడుతుంటారు. కొవ్వు పదార్థాలను మితిమీరి తీసుకోవడం వల్ల స్థూలకాయం మొదలుకొని గుండెజబ్బుల వరకు నానా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయనేది వాస్తవమే కాని, అన్ని రకాల కొవ్వు పదర్థాలూ ఆరోగ్యానికి చేటు తెచ్చిపెట్టేవి కాదు. సమతుల ఆహారంలో కొవ్వులు కూడా అవసరమైన పదార్థాలే. వీటిలో కొన్ని కొవ్వులు ఒంటికి మేలు చేస్తాయి కూడా. పాల ఉత్పత్తుల్లో లభించే కొవ్వులను మేలు చేసే కొవ్వులుగానే పరిగణించాలని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. వెన్న, నెయ్యి, చీజ్, పెరుగు, మీగడ వంటి పాల ఉత్పత్తుల్లోని కొవ్వుల వల్ల గుండెజబ్బులు తలెత్తే ప్రమాదమేమీ ఉండదని అమెరికాలోని టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి పాల ఉత్పత్తుల్లోని కొవ్వులు శరీరానికి చాలా మేలు చేస్తాయని, కొవ్వులతో కూడిన పాల ఉత్పత్తులను తరచు తీసుకుంటున్నట్లయితే పక్షవాతం సోకే ముప్పు 42 శాతం మేరకు తగ్గుతుందని తమ పరిశోధనలో తేలిందని టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ మార్షియా ఓట్టో వెల్లడించారు. పాల ఉత్పత్తుల్లో లభించే కొవ్వుల్లో వాపులను తగ్గించే లక్షణం ఉంటుందని, ఇవి అధిక రక్తపోటును నిరోధిస్తాయని ఆయన వివరించారు. పాల ఉత్పత్తులు, వాటి ప్రత్యామ్నాయాలపై రెండు దశాబ్దాల పాటు నిర్వహించిన సుదీర్ఘ పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి రావడం విశేషం. -
ఐస్ తింటే ఐసీయూకే
చల్లచల్లగా.. వెనిలా.. బటర్‌స్కాచ్.. హనీమూన్.. స్ట్రాబెర్రీ.. చాక్లెట్.. రంగురంగుల్లో నోరూరించే ఐస్ ఫ్లేవర్లు.. ప్రతి ఒక్కరినీ ఐస్‌క్రీం పార్లర్లకు నడిపిస్తున్నాయి.. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఐస్‌క్రీమ్‌లు ఆరగించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ఈ ఐస్‌క్రీమ్‌లలో ఉన్న కొవ్వు పదార్థాలు, కెమికల్స్‌తో కూడిన రంగులు అనారోగ్యం పాలు చేస్తాయిని హెచ్చరిస్తున్నారు. నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు నగరంలో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ఐస్‌క్రీమ్ పార్లర్లపై మెరుపుదాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన ఐస్‌క్రీంలు, ఎక్కువగా కొవ్వు ఉన్న పదార్థాలు, కెమికల్స్‌తో కూడిన రంగులు, పలు డబ్బాలపై తయారు చేసిన తేదీలు లేకపోవడాన్ని గుర్తించారు. అలాగే పార్లర్లలో అపరిశుభ్రంగా ఉండటాన్ని కూడా కనుగొన్నారు. నిబంధనలు ఇలా.. ఐస్‌క్రీమ్ తయారీ విషయాల్లో కొన్ని ప్రమాణాలు, నిబంధనలను ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా చెబుతుంది. ఆహార భద్రత చట్టం 2011 అనుసరించి ప్యాకింగ్ లేబుల్, ఏమి వాడుతున్నారో ఉండాలి. ఐస్‌క్రీమ్‌లలో ఎంత మేర పాలు, రంగులు, దాని అనుబంధ ఉత్పత్తులను, ఏయే ఫ్లేవర్లను కలుపుతారు అనేవిధంగా నిబంధనలు పాటించి, వాటిని పరీక్షించి ఆరోగ్యానికి హానికరంగా లేని విధంగా చూడాలి. కొన్ని ఐస్‌క్రీమ్‌ల్లో టాట్రాజిన్, కార్మోసిన్, రుడమిన్, సన్‌సెట్ ఎల్లో వంటి వాడకంలో పరిమితికి మించి వాడరాదు. టేస్ట్‌కోసం ఈ వాడకం ఎక్కువగా ఉంటే అనారోగ్యానికి హానికరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా పాలలోని కొవ్వు 2.5 శాతం కంటే మించకూడదు, ఘనపదార్థాలు 26 శాతం కంటే తగ్గకూడదు. చక్కెర 10 శాతానికి మించికూడదు. కొవ్వుశాతంలో తేడా నిబంధనలకు సంబంధించి కొన్పి పార్లర్లలో పరిశీలిస్తే పాలలోని ప్రొటీన్లు కొవ్వుశాతంలో తేడా ఉన్నట్లు తెలుస్తోంది. కొవ్వుశాతం 2.5 శాతానికి మించకూడదని నిబంధనలు చెబుతున్నా ఏకంగా తొమ్మిది శాతానికి ఉందని తెలుస్తోంది. అదేవిధంగా వాటిలో వాడే కార్మోసిన్ అనే రంగుతో పాటు మరి కొన్ని రంగులు 152 పీపీఎంగా ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం 100 పీపీఎం మించకూడదని తెలుస్తోంది. ప్యాక్‌లపై అంతా మాయ ప్రధానంగా ఐస్‌క్రీమ్‌ల్లో కొవ్వు శాతాన్ని బట్టి మూడురకాలుగా విభజిస్తారు. సాధారణ వాటిల్లో ఎటువంటి కొవ్వును కలపరు. అదేవిధంగా ఇంకో రకం వాటిల్లో ఒక మాదిరిగా కలుపుతారు, మూడో రకంలో ఏ విధంగా ఉందో ప్యాక్‌పై పేర్కొనాలి. ఈ విధంగా మూడురకాలుగా వివిధ ఐస్‌క్రీమ్‌లు ఉంటాయి. వీటిని ప్యాక్ చేసే ముందు వాటిలో ఏయే పదార్థాలు కలిపారు. ఎప్పుడు తయారు చేశారు. అనే విషయాలు తెలియజేసే విధంగా ప్యాకింగ్ ఉండాలని అధికారులు చెబుతున్నారు. అయితే అందంగా ప్యాకింగ్ చేసినా లోపల ఉన్న దాంట్లో ఏయే పదార్థాలు వాడారో తెలియనీయకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఎక్కువ కాలం ఉండేందుకు వాటిలో కొన్ని రకాల రసాయనాలను కూడా కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. వందల కేజీల రంగుల వాడకం జిల్లాలో సుమారుగా వెయ్యికి పైగా చిన్న, పెద్ద ఐస్‌క్రీమ్ షాపులున్నాయి. ఇవి కాకుండా కొన్ని కంపెనీలు ఐస్‌క్రీమ్‌లు ఉన్నాయి. నిత్యం జిల్లా వ్యాప్తంగా అన్నీ కలసి రోజుకు 10 వేల కిలోలకు పైగా ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు జరుగుతుంటాయని అధికారులు అంచనా వేశారు. దీంతో వాడే కొవ్వుపదార్థాలు, రంగులు వాడకం వందల కిలోల వరకు వాడుతున్నారని అధికారులు కూడా ఒక అంచనాకు వచ్చారు. దీంతో రంగులు, కొవ్వుపదార్థాల వాడకంతో ఆరోగ్యంపై ప్రమాదం చూపే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. వీటితోపాటు అపరిశుభ్రంగా తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు తిన్నా వాటి వల్ల కూడా అనారోగ్యం వస్తుందని తెలిపారు. -
తింటేనే.. కొవ్వులు కరుగుతాయి!
కొవ్వు పదార్థాలు తింటే ఆరోగ్యానికి హాని. ఇదీ మనం తరచూ వినే మాట. అయితే నిన్నమొన్నటివరకూ నెయ్యి, కొబ్బరినూనెల వాడకంపై ఎన్నో అపోహలు ఉండగా.. మితంగానైనా వాటిని తీసుకోవడం మేలని కొందరు వైద్యులు స్వయంగా సూచిస్తున్నారు. తాజాగా తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే.. కొవ్వు పదార్థాలు మన చిన్నపేవుల్లో బ్యాక్టీరియా పెరుగుదలకు సాయపడతాయని.. అంతేకాదు.. ఈ మార్పు వల్ల కొవ్వు జీర్ణమవడమూ వేగవంతమవుతుందని షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఎగ్యూన్ బి.చాంగ్ అంటున్నారు. అమెరికా వంటి పాశ్చాత్యదేశాల్లో ఎక్కువగా తీసుకునే ఆహారంపై వీరు పరిశోధనలు చేశారు. బ్యాక్టీరియా దాదాపుగా లేని.. బ్యాక్టీరియా లేని అనే రెండు రకాల ఎలుకలకు అధిక కొవ్వులు ఉన్న ఆహారం అందించి పరిశీలించారు. తొలి రకం ఎలుకలు కొవ్వులను జీర్ణం చేసుకోలేక ఇబ్బంది పడితే.. రెండో రకం ఎలుకల పేవుల్లో కొన్ని రకాల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందింది. మొదటి రకం ఎలుకలకు ఈ బ్యాక్టీరియాను ఎక్కించినప్పుడు అవి కూడా వేగంగా లావెక్కడం మొదలుపెట్టాయి. ఇంకోలా చెప్పాలంటే వాటికి కొవ్వులు వంటబట్టడం మొదలైందన్నమాట. అధిక కొవ్వులు ఉన్న ఆహారం తీసుకున్న 24 నుంచి 48 గంటల్లోనే చిన్నపేవుల్లో బ్యాక్టీరియా గణనీయంగా పెరుగుతుందని.. వీటి స్రావాలు కొవ్వును విడగొడతాయని.. చాంగ్ చెబుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించేందుకు మరింత మెరుగైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. -
అసలు విలన్ ఎవరు?
కొవ్వు పదార్థాలు ఎక్కువ తినొద్దన్న సలహా మీకు ఎప్పుడైనా వచ్చిందా? కొంచెం బొద్దుగా ఉన్నా.. కాస్త లావెక్కినా అందరి నోటి నుంచి వచ్చే మాటే ఇది. చాలామంది ఈ సూచనను నమ్మి ఆచరిస్తుంటారు కూడా. 50 ఏళ్ల కింద జరిగిన ఒక కుట్ర ఫలితంగా కొవ్వు పదార్థాలు మనకు చెడు చేసేవిగా చిత్రీకరించాయని.. అసలు విలన్ మనం తినే చక్కెర అంటున్నారు శాస్త్రవేత్తలు. ఫలానా పదార్థం మనకు మంచి చేస్తుంది... ఫలా నాది హాని చేస్తుందని ఎవరు నిర్ధరిస్తారు? పదార్థాలను క్షుణ్నంగా పరిశీలించాక శాస్త్రవేత్తలు వాటి లక్షణాలను వెల్లడిస్తారు. ఇందుకు సంబంధించి పరిశోధన వ్యాసాలు ప్రచురిస్తారు. 1960 ప్రాంతంలో ‘ప్రాజెక్ట్ 259’పేరుతో ఎలుకలపై రెండు పరిశోధనలు జరిగాయి. చక్కెర పరి శ్రమల సమాఖ్య ఒకటి ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అం దించింది. ఒక పరిశోధనలో భాగంగా రెండు గుంపుల ఎలుకలను తీసుకున్నారు. ఒక గుంపులోని వాటికి చక్కెరలు బాగా ఎక్కువ ఉండే ఆహారాన్ని అందించగా.. ఇంకో దానికి చేపలు, పప్పుధాన్యాలు, ఈస్ట్, బీన్స్ వంటి వాటితో కూడిన సమతుల ఆహారం అందించారు. కొంత కాలం తర్వాత పరిశీలిస్తే మొదటి గ్రూపులోని ఎలుకలకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. వీటిల్లో చెడు కొవ్వులుగా పరిగణించే ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రెండో అధ్య యనంలో భాగంగా కొన్ని ఎలుకలకు చక్కెరలు ఎక్కువగా ఉండే తిండి.. రెండో గ్రూపు ఎలుకలకు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారమందించి చూడగా.. మొదటి గ్రూపు ఎలుకల్లో కేన్సర్ కారక ఎంజైమ్‌లు ఎక్కువైనట్లు తెలిసింది. చక్కెరతో సమస్యలున్నాయని స్పష్టంగా తెలిపిన ఈ అధ్యయనాలు ఇప్పటివరకూ ప్రచురణకు నోచుకోలేదు. చక్కెర పరిశ్రమల సమాఖ్య ‘ప్రాజెక్టు 259’ను అర్ధంతరంగా నిలిపేసింది. తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి..? గత 50 ఏళ్లలో చక్కెరల దుష్ప్రభావంపై చాలా పరిశోధనలే జరిగాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో పాటు మూత్ర పిండాల సమస్యలకూ ఈ పదార్థమే కారణమని పలు పరి శోధనలు స్పష్టం చేశాయి. తాజాగా జరిగిన కొన్ని పరిశోధ నలు చక్కెరలు కేన్సర్ కణితుల పెరుగుదల పనిచేస్తున్నట్లు సూచించాయి. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలం వరకూ కొన్ని రకాల ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదని చెబుతూ వచ్చిన వైద్యులు కూడా ఇప్పుడు తమ విధానాలను మార్చుకుంటున్నారు. రోజుకు కొంత నెయ్యి, లేదంటే గుడ్డులోని పచ్చసొన తీసుకోవడంలో తప్పు లేదని అంటున్నారు. శీతల పానీయాల్లో చక్కెరలను తగ్గించేం దుకు పరిశ్రమలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. 2021 నాటికి అమెరికాలో తయారయ్యే ప్రతి ఆహార పదార్థం ప్యాకేజింగ్‌పై చక్కెర మోతాదు ఎంత అన్నది స్పష్టంగా ప్రదర్శించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకీ కుట్ర.. అధిక చక్కెరల వల్ల రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశ ముందని గతేడాది ఓ అధ్యయనం ప్రచురితమైనప్పుడు అమెరికాకు చెందిన ‘షుగర్ అసోసియేషన్’తీవ్రంగా స్పందించింది. ఈ పరిశోధన సంచలనాల కోసం రాసిందే గానీ.. మనం తీసుకునే చక్కెరలకు, కేన్సర్‌కు ఏ మాత్రం సంబంధం లేదని ఖండించింది. ఈ ‘షుగర్ అసోసియేషన్’ను గతంలో ‘ది షుగర్ రీసెర్చ్ ఫౌండేషన్’ అని పిలిచే వారని.. కొంతమంది శాస్త్రవేత్తలు ప్లాస్ బయాలజీ అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. తమకు అనుకూలంగా లేని పరిశోధనల గొంతు నొక్కేయడం దీనికి కొత్తేమీ కాదని.. 50 ఏళ్ల కింద కూడా ఇలాగే చేశారంటూ 1960 నాటి అంశాన్ని వివరించడంతో విషయం వెలుగు చూసింది. 1967 ప్రాంతంలో ‘షుగర్ అసోసియేషన్’ చక్కెరల వల్ల ప్రమాదం లేదని.. సమస్య అంతా కొవ్వుల వల్లేనని ప్రచారం చేసేందుకు ముగ్గురు హార్వర్డ్ శాస్త్రవేత్తలకు లంచాలిచ్చినట్లు ఇప్పటికే స్పష్టమవడం కొసమెరుపు! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఓట్స్ ముస్లీ
హెల్దీ ట్రీట్ కావలసినవి: ఓట్స్ – 1 కప్పు నీరు – 2 కప్పులు ఆపిల్ – 1 నిమ్మరసం – 2 టీ స్పూన్లు కిస్మిస్ – 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు – 1 టేబుల్ స్పూన్ పాలు – 1 కప్పు తేనె – 2 టీ స్పూన్లు తయారి: 1. రాత్రి ఓట్స్‌ని నీళ్ళలో నానబెట్టాలి. 2. ఉదయాన ఆపిల్ పై తొక్క తీసి ముక్కలుగా కట్‌చేసి, ముక్కలకు బాగా అంటేలా నిమ్మరసం వేసి కలపాలి. 3. తర్వాత ఇందులో కిస్మిస్, వేరుశనగపప్పు, మెత్తగా అయిన ఓట్స్ వేసి కలపాలి. 4. పాలు పోసిన తర్వాత పైన తేనె వేసి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వాలి. నోట్: పిల్లలకు సరైన పోషకాహారం అందించాడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఓట్స్‌లో కొవ్వుపదార్థాలు ఉండవు. కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఈ అల్పాహారం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే. ఈవెనింగ్ స్నాక్‌గాను తీసుకోవచ్చు. ద్రాక్ష, స్ట్రాబెర్రీ, అరటిపండ్లనే కాదు పాలు కూడా ఇష్టప్రకారం వాడుకోవచ్చు. -
గుండెకోత వద్దు
సాక్షి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ పింక్ అక్టోబర్ థింక్ టుడే భారతీయ మహిళలకు వచ్చే క్యాన్సర్లలో మిగతా అన్నిటికంటే ఎక్కువగా కనిపించే వాటిల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇటీవల చాలా ఎక్కువ మంది మహిళలు దీనికి గురవుతున్నారు. ఒకప్పుడు దాదాపు 50 ఏళ్లు పైబడితేనే రొమ్ము క్యాన్సర్ వస్తుందనుకునే వారు. అయితే ఇటీవల చిన్న వయసు మహిళల్లోనూ ఇది కనిపిస్తుండటం ఒక విషాదం. ఇక భారతీయ మహిళల్లో మరో అంశమూ కాస్త ఆందోళన కలిగించేదే. పాశ్చాత్య దేశవాసులతో పోలిస్తే మన దేశపు మహిళల్లో ఇది ఒక దశాబ్దం ముందుగానే కనిపిస్తోంది. అంటే పాశ్చాత్య మహిళల్లో ఏ 40 దాటిన వారిలోనో కనిపించే రొమ్ముక్యాన్సర్... మన దేశ మహిళల్లో ఇటీవల 30లలోనే కనిపిస్తోంది. కానీ కారుచీకట్లలో కాంతిరేఖలా ఒక ఆశాజనకమైన విషయం కూడా ఉంది. దీన్ని గురించి ముందే తెలుసుకుంటే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. దీనిపై అవగాహన పెంచుకుని ముందుగానే గుర్తించగలిగితే దాదాపు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మరెన్నో ఏళ్లు ఆర్థిక భారాలు లేకుండా మానసికంగా కలిగే బాధలకు దూరంగా, ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు. అందుకు ఉపయోగపడేవే ఈ కథనాలు. మమకారం రంగేంటి? మేమైతే ‘పింక్’ అనే అంటాం. అమ్మ, చెల్లి, భార్య, కూతురు... అందరూ పంచేది మమకారమే. మరి వాళ్లను జాగ్రత్తగా చూసుకోని నాన్న, అన్న, భర్త, కొడుకు ఉంటే... ఏమవచ్చు? గుండెకోతే!! బ్రెస్ట్ క్యాన్సర్‌ను వెంటనే కనుగొంటే ఎదకోత వరకూ పోదు. మగవాళ్లకో విన్నపం. మీవాళ్ల గురించి కేర్ తీసుకోండి. ఇప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్‌కి తీసుకెళ్లండి. మహిళల్లో ఇటీవల రొమ్ము క్యాన్సర్లు పెరగడానికి ఆధునిక జీవనశైలి (లైఫ్ స్టైల్) దోహదం చేస్తోంది. ఈ అంశంతో పాటు మరెన్నో అంశాలు దీనికి కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని... సాధారణంగా పెరిగే వయసు (పైబడుతున్న వయసు-ఏజింగ్) రొమ్ము క్యాన్సర్‌కు ఒక ప్రధానమైన ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్). అయితే ఇది అందరిలోనూ ఉండే నివారించలేని రిస్క్ ఫ్యాక్టర్. ఆధునిక జీవనశైలిలో వచ్చే మార్పులతో కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది. పైన పేర్కొన్న అంశం వల్ల స్థూలకాయం వచ్చేందుకూ దోహదం చేస్తుంది. దాని వల్ల ఇతర అనర్థాలతో పాటు రొమ్ము క్యాన్సర్‌కూ అవకాశాలు ఎక్కువ. తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు / ఏడాది పాటైనా బిడ్డకు రొమ్ము పాలు పట్టించాలి. అది జరగకపోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ రావచ్చు. ఇక మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు కూడా రొమ్ము క్యాన్సర్‌కు ఒక కారణం కావచ్చు. పాశ్చాత్య దేశ వాసులతో పోలిస్తే మన దేశంలో రొమ్ము క్యాన్సర్ త్వరగా గుర్తించినప్పుడు... మన దేశ మహిళల్లో ఉండే జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం. కొంతవరకు జన్యుపరమైన అంశాలు. లక్షణాలు రొమ్ము క్యాన్సర్‌ను చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. ఉదాహరణకు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి, స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కోసారి అవి నొప్పిగా లేనప్పుడు మహిళలు వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అవి హానికరం కాని గడ్డలా, లేక హానికరమైనవా అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి. రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం రొమ్ము ఆకృతిలో మార్పులు బాగా ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్ రావడం. రొమ్ములో సొట్టలు పడినట్లుగా ఉండటం రొమ్ము పరిమాణంలో మార్పులు వచ్చినట్లుగా అనిపించడం, వాటిలో ఏదైనా తేడాను గమనించడం. (అయితే నెలసరి సమయంలో మహిళల్లో రొమ్ములు గట్టిబడి... ఆ తర్వాత మళ్లీ నార్మల్ అవుతాయి. అందుకోసం ప్రతినెలా వచ్చే మార్పుల గురించి అంతగా ఆందోళన అవసరం లేదు. కానీ అలాగే గట్టిబడి ఉండటం కొనసాగితే మాత్రం ఆ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. నిపుల్కు సంబంధించినవి : రొమ్ముపై దద్దుర్ల వంటివి (ర్యాష్) లేదా వ్రణాలు రావడం రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటి స్రావాలు రావడం. బాహుమూలాల్లో: చివరిదశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలవడం. భుజానికి సంబంధించి: భుజం వాపు కనిపించడం. స్క్రీనింగ్ సాధారణం కంటే ఎక్కువ రిస్క్ ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. జాతీయ హెల్త్ సర్వే (ఎన్హెచ్ఎస్) బ్రెస్ట్ స్క్రీనింగ్ కార్యక్రమం సిఫార్సుల మేరకు రిస్క్ ఫ్యాక్టర్లు లేని మహిళలైతే 50 - 70 ఏళ్ల మధ్యలో ప్రతి మూడేళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న మహిళలైతే మరింత తరచుగా ఈ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలి. కుటుంబ చరిత్రలో రొమ్ము క్యాన్సర్ వచ్చిన దగ్గరి బంధువులు (అంటే అమ్మ, చెల్లెళ్లు, కూతుళ్లు) ఉంటే రిస్క్ రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది. ఇక మహిళల్లోని జన్యువులైన బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే రెండింటిలో తేడాలు ఉంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళల్లోని 5% మందిలో ఈ రెండు జన్యువుల్లో మ్యుటేషన్స్ (ఉత్పరివర్తన మార్పులు) చోటు చేసుకున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. నిర్ధారణ తొలుత స్పర్శ ద్వారా ఏవైనా తేడాలు తెలుసుకోవడం (ఫిజికల్ ఎగ్జామినేషన్) ద్వారా. మామోగ్రఫీ అనే స్కాన్ ద్వారా. (ఇందులో డిజిట్ లేదా ఎమ్మారై లేదా అల్ట్రాసౌండ్ స్కాన్)ను నిర్వహిస్తారు. జెనెటిక్ స్క్రీనింగ్ కూడా చేస్తారు. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ (ఎఫ్ఎన్ఏసీ) అనే పరీక్ష ఒకవేళ అవసరం ఉందని తెలిస్తే వైద్యులు బయాప్సీ (అంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపి చేసే నిర్ధారణ) లేదా ఎఫ్ఎన్ఏసీ అనే చిన్న నీడిల్ పరీక్ష చేస్తారు. మామోగ్రఫీతో పాటు ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్ (కొన్ని సందర్భాల్లో ఇది తప్పనిసరి) ఛాతీ ఎక్స్‌రే కడుపు స్కానింగ్ ఎముకల స్కానింగ్ (ఈ చివరి పరీక్ష వ్యాధి ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోవడం కోసం చేస్తారు). ఇటీవల రొమ్ములో ఏవైనా తేడాలు రాగానే మామోగ్రఫీ చేయించుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఒక స్క్రీనింగ్‌లో తప్పినా... మరో స్క్రీనింగ్లోనైనా ఈ వ్యాధిని కనుగొనడం ముమ్మరమైంది. ఫలితంగా ఎక్కువమందిని వ్యాధి బారినుంచి వైద్యులు కాపాడగలుగుతున్నారు. పైగా విదేశాల్లో ఆయుప్రమాణాలు ఎక్కువ కావడంతో అక్కడ 50 - 70 ఏళ్ల వయసులో జరిగే పరీక్షలు మన దేశంలో 30 -60లలోనే జరుగుతున్నాయి. దాంతో రొమ్ము క్యాన్సర్‌ను మరింత ముందుగా కనుగొనడానికి అవకాశం ఏర్పడుతోంది. చికిత్స ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అపోహ మాత్రమే. ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలగించవచ్చు. రొమ్ము క్యాన్సర్ చుట్టుపక్కలకు కూడా పాకిందని తెలిసినప్పుడు మాత్రమే రొమ్మును తొలగిస్తారు. అయినా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా మిగతా చోట్ల ఉండే కండరాలతో ఆ ఇతర చికిత్సలు : ఈ రోజుల్లో శస్త్రచికిత్సతో పాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మాసెక్టమీలో రొమ్ము తొలగిస్తారు. అయితే రొమ్ముక్యాన్సర్ తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియో థెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే ఆంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా రక్షిస్తారు. నివారణ ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకం అవుతుంది. ఇందుకోసం ఒక మహిళ వ్యక్తిగత అలవాట్లు/జీవనశైలి, ఆమె కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఇందుకోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో కొన్నింటిని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవచ్చు. మరికొన్ని మార్చలేనివీ ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుకొని ఒక మహిళకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను అంచనా వేస్తారు. ఇందులో... మార్చలేని అంశాలు: వయసు, మహిళ కావడం (జెండర్), రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో రక్తసంబంధం, రుతుస్రావ చరిత్ర, ఏ వయసులో రుతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం. మార్చుకోగల అంశాలు: ఎక్కువ బరువు ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంత మంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, ఆల్కహాల్ అలవాట్లు, పోషకాహారం. వ్యాయామం: మహిళలంతా మరీ తీవ్రమైనవీ, మరీ తక్కువవీ కాకుండా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా వ్యాయామం చేయాలి. డా. ఏవీఎస్ సురేశ్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, కాంటినెంటల్ హాస్పిటల్స్ గచ్చిబౌలి, హైదరాబాద్ ట్రీట్మెంటే... ధైర్యం ఇచ్చింది ఒకరోజు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉంటే రొమ్ములో ఏదో తేడా అనిపించింది. మా నాన్నగారు రేడియేషన్ ఆంకాలజిస్ట్. అమ్మ పాథాలజిస్ట్. అందుకని బ్రెస్ట్ క్యాన్సర్ గురించి నాకు అవగాహన ఉంది. నా స్వీయపరీక్ష మీద ఉన్న నమ్మకంతో నేను డాక్టర్ని కలిశాను. నేను అనుకున్నది నిజమే. బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారించారు. అప్పుడు నా వయసు 35. క్యాన్సర్‌లాంటి పెద్ద వ్యాధిని ఎదుర్కొనే వయసు కాదది. కానీ ధైర్యంగా పోరాడాలనుకున్నా. రొమ్ము తీసినా పర్వాలేదనుకున్నా. ట్రీట్మెంట్లో భాగంగా జుత్తు ఊడిపోతుందని బాధపడలేదు. ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టడానికి ఇలాంటివన్నీ చిన్న చిన్న త్యాగాలు అనిపించింది. ఇలాంటి అనారోగ్యానికి గురైనప్పుడు శారీరకంగా, మానసికంగా చాలా బలంగా ఉండాలని తెలుసు. అయినా భయపడ్డాను. కాని ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టాక ధైర్యం పెరిగింది. అనవసరంగా భయపడ్డానని అప్పుడు అనిపించింది. నా అనుభవంతో చెబుతున్నా... రొమ్ము క్యాన్సర్‌ని సులువుగా జయించవచ్చు. నా కుటుంబ సభ్యులు, నాకు అత్యంత సన్నిహితుడు అయిన కమల్‌హాసన్ ఇచ్చిన ధైర్యం నేను కోలుకోవడానికి ఓ కారణం అయింది. నేను కొన్ని సినిమాల్లో చాలా శక్తిమంతమైన పాత్రలు చేశాను. క్యాన్సర్ జయించడానికి అవి కూడా ఓ కారణం అయ్యాయి. నాకు క్యాన్సర్ సోకిందని తెలిసిన మొదటి సంవత్సరంలో నేను 56 సినిమాలు చూశాను. అన్నీ థియేటర్లకు వెళ్లి చూసినవే. ఏదో జరగకూడనిది జరిగిందని కుంగిపోయి మంచానికే పరిమితం కాకూడదు. ఓపిక ఉన్నంతవరకూ పనులు చేసుకోవచ్చు. తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స చాలా తేలిక అవుతుంది. అందుకే ముప్పై ఏళ్లు వచ్చాయంటే ‘మామోగ్రఫీ’ చేయించుకోవాలి. మహిళలకు ఇంట్లో ఉన్నవాళ్లమీద ఉండే శ్రద్ధ తమ మీద ఉండదు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. - గౌతమి, సినీ నటి -
మాంసం కొనేటప్పుడు జాగ్రత్తసుమా!
రాయవరం : ఇటీవలి కాలంలో మాంసం వినియోగం పెరుగుతోంది. మాంసంలో అధికంగా మాంసకృత్తులు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు అధికంగా లభించడమే దీనికి కారణం. వీటిని కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొనకపోతే వ్యాధులబారిన పడే అవకాశం ఉంటుందని రాయవరం పశువైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు హెచ్చరిస్తున్నారు. మాంసం నాణ్యతను, మాంసం నిల్వ అయితే కలిగే మార్పులను గమనించి కొనుగోలు చేయాలంటున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మాంసం నాణ్యత రంగు, మెత్తదనం, రుచి, వాసన, నీటిని పీల్చే గుణాన్నిబట్టి మాంసం నాణ్యతను నిర్ధారించవచ్చు. సాధారణంగా మాంసం ఎరుపు రంగులో ఉంటుంది. గొడ్డు మాంసం ముదురు ఎరుపు రంగులోను, మేక, గొర్రె మాంసం మధ్యస్థ ఎరుపు రంగులోను, పంది మాంసం తెలుపు రంగులోను ఉంటుంది. చిన్న వయసు ఉన్న పశువు మాంసంతో పోలిస్తే పెద్ద వయసు ఉన్న పశువు మాంసం ఎక్కువ ఎరుపు రంగులో ఉంటుంది. నీటిని పీల్చే గుణం లేత వయసు పశువు మాంసంలో ఎక్కువగా ఉంటుంది. నిల్వ ఉంచిన మాంసానికి నీటిని పీల్చుకునే గుణం తగ్గుతుంది. మెత్తదనం అనేది కండరాలను కలిపే కణజాలంవల్ల కలుగుతుంది. చిన్న వయసు పశువులతో పోలిస్తే పెద్ద వయసు పశువుల్లో ఈ కణజాలం తక్కువగా ఉండి మాంసం గట్టిగా ఉంటుంది. ప్రతి జంతువు మాంసానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. దానినిబట్టి మాంసాన్ని గుర్తించవచ్చు. మాంసం నిల్వ అయితే కలిగే మార్పులు * మాంసాన్ని సక్రమంగా నిల్వ చేయకుంటే కొన్ని మార్పులు జరిగి పాడైపోతుంది. సూక్ష్మజీవులు, శిలీంధ్రాల మూలంగా మాంసంలోని కొవ్వులు, మాంసకృత్తులు విచ్ఛిన్నమై కొన్ని మార్పులు జరుగుతాయి. * సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు జరిపే చర్యల వల్ల బ్యుటరిక్, ప్రొపియోనిక్లు ఏర్పడి మాంసానికి చెడు వాసన కలుగుతుంది. * నిల్వ మూలంగా సూక్ష్మజీవులు స్రవించే రంగుల వలన మాంసం ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోకి మారుతుంది. * సూడోమోనాస్, స్ట్రెప్టోకోకస్, లాక్టోబాసిల్లస్ వంటి బాక్టీరియాల వల్ల మాంసంపై పలుచని జిగురు వంటి పొర ఏర్పడుతుంది. * మాంసంపైన శిలీంధ్రాల వల్ల నలుపు, తెలుపు, ఆకుపచ్చని మచ్చలు, రంగు మచ్చలు ఏర్పడతాయి. * మాంసంలోని సల్ఫర్ పదార్థాలు విచ్ఛిన్నమవడం వలన హైడ్రోజన్ సల్ఫేట్, ఇతర మార్పుల వల్ల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతాయి. * పాడైపోయినప్పుడు ఉత్పత్తి అయిన ఆమ్లాల వలన మాంసం పుల్లగా మారుతుంది. * కొవ్వు పదార్థాల విచ్ఛిన్నం జరిగి ఒక రకమైన వాసన వస్తుంది. దీనినే ‘రేన్సిడ్’ వాసన అంటారు. * ప్రొటీన్లు విచ్ఛిన్నం జరిగితే చేదు రుచి, చెడు వాసన కలుగుతాయి. * ఫాస్ఫోరిసాన్నే అంటారు. * కొన్నిసార్లు ఎముక దగ్గరి మాంసం పాడైపోతుంది. -
హోమియోలో మైగ్రేన్‌కు మంచి చికిత్స...
మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల్లో అకస్మాత్తుగా రక్తం ప్రవహించడంతో అవి ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. ఫలితంగా అక్కడి నరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో నరాల నుంచి కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. రక్తనాళాలు వ్యాకోచించినకొద్దీ నొప్పి అధికమవుతుంది. ఈ సమస్యనే మైగ్రేన్ అంటారు. ఈ సమస్య తీవ్రస్థాయికి చేరినప్పుడు నరాల వ్యవస్థ దెబ్బతినడం వల్ల మెదడులో సమస్య ఉన్న భాగం నుంచి వచ్చే నరాల పనితీరు ప్రభావితమై శరీరంలోని కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. దాంతోపాటు మైగ్రేన్ ఉన్నవారికి కళ్లు తిరగడం, తలతిరగడం, వస్తువులు రెండుగా కనిపించడం వంటి లక్షణాలూ ఉంటాయి. హెమీప్లీజిక్, రెటినల్, ఆక్యులార్ మైగ్రేన్లలో శరీరం పక్షవాతం వచ్చినట్లుగా ఉండటం, చూపు ఒకవైపు సరిగ్గా కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కారణాలు : మానసిక ఒత్తిడి నిద్రలేమి ఉపవాసం హార్మోన్ల సమస్యలు అధిక వెలుతురు వాసనలు మత్తుపదార్థాలు, పొగాకు వాడకం, పొగతాగడం కాఫీ వంటి పానీయాలు మహిళలలో రుతుక్రమం ముందర ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఎక్కువగా ఉండటం వల్ల పై లక్షణాలు కనిపించవచ్చు. ఈ కారణాలు సాధారణంగా తలనొప్పి వచ్చే తత్వం ఉన్నవారికి సమస్య మరింత అధికమయ్యేలా చేస్తాయి. లక్షణాలు : తలనొప్పి అధికంగా, వేగంగా కొట్టుకుంటున్నట్లు, తలను ముక్కలు చేస్తున్నట్లుగా, ఒకవైపు లేదా రెండువైపులా ఉండవచ్చు నొప్పి సాధారణంగా నుదురు, కళ్లచుట్టూ, తల వెనక భాగంలో రావచ్చు తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి ఎక్కువ కావచ్చు వికారం, వాంతులు, విరేచనాలు, ముఖం పాలిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వెలుతురు చూసి తట్టుకోలేకపోవడం, శబ్దం వినలేకపోవడం * నిద్రలేమి, చికాకు, నీరసం, ఉత్సాహం లేకపోవడం, ఆవలింతలు, కొందరిలో తీపి ఇంకా కారపు పదార్థాలను ఎక్కువగా ఇష్టపడటం మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో తలనొప్పికి ముందు కొన్ని లక్షణాలను గమనించవచ్చు. దీనినే మైగ్రేన్ ఆరా అంటారు. ఈ ఆరా లక్షణాలు... కళ్ల ముందు మెరుపులు, ప్రకాశవంతమైన జ్యోతులు కనిపించడం వంటివి. ఈ మెరుపులు ముందర మధ్యలో మొదలై... చివరలకు వెళ్లినట్లుగా కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : =ఎక్కువ శబ్దం లేని, వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవాలి =తగినంత నిద్రపోవాలి = మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు మానుకోవాలి =తలనొప్పి ఎక్కువగా ఉన్న సమయంలో కొవ్వు పదార్థాలు, మాంసం, పప్పుదినుసులు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు అల్పాహారాన్ని తీసుకోవాలి = తగినంత నీరు తాగాలి = జీవనశైలిలో మార్పులు చేసుకుని రోజూ వ్యాయామం చేయాలి = మానసిక ఒత్తిడిని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ఒత్తిడి కలిగించే అంశాలకు దూరంగా ఉండాలి. హోమియో చికిత్స : ఈ సమస్యకు హోమియోలో వాడదగిన మందులు సాంగ్వినేరియా, బ్రయోనియా, నేట్రమ్మూర్, పల్సటిల్లా, నక్స్‌వామికా, సెపియా, లాకెసిస్, స్పైజీలియా వంటివి. వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకుని పై మందులను వాడాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
రకరకాల గుండెకోతలు!
గుండెకు వెళ్లే రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు చేరడంగాని లేదా రక్తం గడ్డకట్టడం వల్ల కాని రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడతాయి. ఆ రక్తప్రసరణలోని అడ్డంకులు ఒక గుండె కండరానికే సంభవిస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య తలెత్తినప్పుడు సాధారణంగా మందుల ద్వారానే దాన్ని నయం చేయవచ్చు. అయితే కొంతమందిలో మాత్రం ఆ అడ్డంకులను తీసేయడానికి బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. దీనితోపాటు గుండెకు చేసే శస్త్రచికిత్సల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ, బీటింగ్ హార్ట్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ అంటూ రకరకాల పదాలు వినిపిస్తుంటాయి. ఈ రకరకాల సర్జరీలు ఏమిటి, వాటి ప్రయోజనాలేమిటి, ఎందుకు? ఎప్పుడు చేస్తారు... లాంటి సందేహాల నివృత్తికే ఈ కథనం. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకులను బెలూన్ ద్వారా తొలగించి అక్కడ ఒక ‘స్టెంట్’ అమర్చడాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ ఆపరేషన్ అంటారు. ఇది పూర్తిగా శస్త్రచికిత్సగా పరిగణించలేం. ఇక పూర్తిస్థాయి శస్త్రచికిత్సల విషయానికి వస్తే... ముందుగా అసలు బైపాస్ సర్జరీ అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే వాటికి ప్రత్యామ్నాయంగా వేరే రక్తనాళాలను ఉపయోగించి, కొత్తమార్గం ద్వారా రక్తప్రసరణ జరిగేలా చేయడమే బైపాస్ శస్త్రచికిత్స. ఈ ప్రక్రియకోసం అవసరమైన అదనపు రక్తనాళాన్ని కాలి నుంచి తీసిన సిరను గాని లేదా రొమ్ము ఎముక పక్కనే ఉన్న మ్యామరీ ధమనిని గాని ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన సర్జరీలలో చాలాపేర్లు వినిపిస్తుంటాయి. అవి ఏయే సందర్భాల్లో, ఎందుకు చేస్తారో చూద్దాం. బైపాస్ ఎవరెవరికి, ఎలాంటి ఫలితం...? గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెలో ఎడమపక్క ఉండే ముఖ్య రక్తనాళంలోని మొదటిభాగంలోనే అడ్డంకి ఉన్నప్పుడు గుండె పంపింగ్ శక్తి తక్కువగా ఉన్నప్పుడు రక్తనాళంలో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడినప్పుడు మధుమేహవ్యాధి ఉన్న వారికి... ఓపెన్‌హార్ట్ సర్జరీ అంటే...? బైపాస్ శస్త్రచికిత్స సమయంలో రొమ్ముఎముకను చీల్చి సర్జన్ గుండె ఉపరితలానికి చేరుకుంటాడు. గుండె అనుక్షణం కొట్టుకుంటూ ఉంటే ఆపరేషన్ చేయడం క్లిష్టంగా ఉంటుంది. అందుకే తాత్కాలికంగా గుండెను అచేతన స్థితిలో ఉంచి ఈ ఆపరేషన్ చేస్తారు. అప్పుడు శరీరానికి రక్తప్రసరణ యథావిధిగా కొనసాగేందుకు హార్ట్‌లంగ్ మెషిన్ అనే పరికరాన్ని వాడతారు. ఏ శస్త్రచికిత్సలోనైతే ఈ హార్ట్‌లంగ్ మెషిన్‌ను ఉపయోగించి చేస్తే... దాన్ని ‘ఓపెన్‌హార్ట్ సర్జరీ’ అనుకోవచ్చు. క్లోజ్డ్ హార్ట్ సర్జరీ అంటే...? ఏ శస్త్రచికిత్సలోనైతే పైన పేర్కొన్న హార్ట్ లంగ్ మెషిన్‌ను ఉపయోగించకుండా శస్త్రచికిత్స చేస్తారో దాన్ని క్లోజ్డ్ హార్ట్ సర్జరీ అంటారు. సాధారణంగా గుండె కవాటాల్లో ఒకటైన మైట్రల్ వాల్వ్‌ను బాగుచేసేప్పుడు ఈ శస్త్రచికిత్స చేస్తారు. బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే...? దీన్ని ‘ఆఫ్ పంప్ సర్జరీ’ అని కూడా అంటారు. ఇందులో కూడా రొమ్ము ఎముకను చీలుస్తారు. ఈ ప్రక్రియలో ఓ పక్క గుండె స్పందనలు యథావిధిగా కొనసాగుతుండగానే బైపాస్సర్జరీ నిర్వహిస్తారు. ఆక్టోపస్ అనే ఒక పరికరం ద్వారా గుండెలో ఆపరేషన్ జరుగుతున్న భాగం వరకు కదలకుండా చేస్తారు. మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే..? గత ఐదేళ్లకాలంలో గుండె శస్త్రచికిత్సలో అత్యంత అధునాతన వైద్యవిధానాలు చోటుచేసుకున్నాయి. కేవలం చాలా చిన్నగాటు సహాయంతోనే బైపాస్ సర్జరీ నిర్వహించడం వీటిల్లో ఒకటి. ఇందులో రొమ్ము ఎముకను చీల్చాల్సిన అవసరం లేదు. అయితే పెద్ద శస్త్రచికిత్సల్లోలాగే మత్తుమందు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా చిన్న రంధ్రం ద్వారా ఈ లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేస్తారు. టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్ అంటే ఈ ప్రక్రియలో కాలి సిరలను గాక మణికట్టులోనివి, ఎడమ, కుడి రొమ్ము ఎముక ధమనులను ఉపయోగించి సర్జరీ చేస్తారు. ఎండోస్కోపిక్ సర్జరీ అంటే...? ప్రస్తుతం మణికట్టు నుంచి తీసే ధమని లేదా కాలి నుంచి తీసే సిరల విషయంలో పూర్తిగా గాటు పెట్టి తీయకుండా, చిన్న రంధ్రం చేసి మాత్రమే వాటిని సేకరిస్తారు. దీనివల్ల ఆ గాయం చిన్నది కావడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. హైబ్రీడ్ సర్జరీ అంటే...? కొన్నిసార్లు బైపాస్ శస్త్రచికిత్సలో రోగి చాలా సంక్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని రక్తనాళాలకు యాంజియోప్లాస్టీ ద్వారా, మరికొన్నింటికి బైపాస్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల చాలా రిస్క్‌లు తగ్గి, రోగి చాలా త్వరగా కోలుకునేలా చేయవచ్చు. ఇలా పలురకాల శస్త్రచికిత్స ప్రక్రియలను చేయడాన్ని ‘హైబ్రీడ్ బైపాస్ సర్జరీ’ అంటారు. రొబోటిక్ బైపాస్ సర్జరీ అంటే...? పేరులో పేర్కొన్నట్లుగా ఇందులో బైపాస్ శస్త్రచికిత్సను రోబో సహాయంతో డాక్టర్లు నిర్వహిస్తారు. ఇందులో చాలా చిన్న రంధ్రం మాత్రమే చేసి, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అంత చిన్న రంధ్రం నుంచి డాక్టర్ వేళ్లు రోగి శరీరంలోకి ప్రవేశింపజేయడం కష్టం. అందుకే రోబో తాలూకు సన్నని వేళ్లని ఆ రంధ్రంలోకి ప్రవేశింపజేసి, సర్జన్లు వాటిని బయటి నుంచి నియంత్రిస్తూ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు. - నిర్వహణ : యాసీన్ బైపాస్ సర్జరీ తర్వాత... బైపాస్ శస్త్రచికిత్స తర్వాత రోగి కోలుకోడానికి 2-3 నెలలు పడుతుంది. మొదట్లో కొద్దిగా నీరసంగా ఉండటం సహజం. రొమ్ము ఎముకను చీల్చడం వల్ల ఛాతీకండరాల్లో, మెడ ఎముకల్లో, వెన్నుపూసల్లో, జబ్బల్లో నొప్పులు సాధారణం. అదే సమయంలో కాలు లేదా చేతి నుంచి రక్తనాళాన్ని బయటకు తీస్తారు కాబట్టి అక్కడా నొప్పి, వాపు ఉండవచ్చు. కొందరు ఈ ఆపరేషన్ తర్వాత మనోనిబ్బరం కోల్పోతారు. మరికొందరికి జ్ఞాపకశక్తి, దృష్టికేంద్రీకరణ శక్తి కొద్దిగా తగ్గవచ్చు. కానీ ఆర్నెల్లల్లో రోగి పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉంది. జీవనోపాధి కోసం వారు చేసే పనులు బరువైనవి కాకపోతే రెండు నెలల తర్వాతి నుంచే పనికి వెళ్లవచ్చు. మిగతావారు మూడు నెలలు ఆగడం శ్రేయస్కరం. ఇక ఈ ఆపరేషన్ తర్వాత రెండునెలల పాటు ఎలాంటి వాహనం నడపడం మంచిది కాదు. శస్త్రచికిత్స తర్వాత రోగి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం పూర్తిగా మానేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. బరువును నియంత్రించుకోవడం, కొవ్వును అదుపులో ఉంచుకోవడం, మనోనిబ్బరంతో వ్యవహరించడం, వైద్యుల సూచనలను పాటించడం వంటివి చేస్తూ మిగతా జీవితాన్ని మామూలుగానే గడిపేయవచ్చు.