
హెల్త్ టిప్స్
వారంలో ఒక రోజు లేదా కనీసం ఒక్కపూట పొట్టకు హాలిడే ఇవ్వడం ఆరోగ్యకరమే. అయితే ఆ రోజు తేనె నిమ్మరసం తీసుకుంటూ ఉంటే ఒంట్లో ఉన్న కొవ్వు త్వరగా కరగడం ప్రారంభమవుతుంది.
తేనె, నిమ్మరసం వల్ల దేహానికి రోజువారీ పనులకు అవసరమైన శక్తి అందుతుంది. ఒక టీ స్పూన్ తేనె, ఒక నిమ్మ చెక్కరసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా రోజులో ఎన్నిసార్లయినా తాగొచ్చు.