అదానీ విషయంలో ఆ రెండు పార్టీలు ఒక్కటే: కేటీఆర్‌ | Brs Working President Ktr Pressmeet On Adani Issue | Sakshi
Sakshi News home page

అదానీ విషయంలో ఆ రెండు పార్టీలు ఒక్కటే: కేటీఆర్‌

Published Fri, Nov 22 2024 3:13 PM | Last Updated on Fri, Nov 22 2024 3:53 PM

Brs Working President Ktr Pressmeet On Adani Issue

సాక్షి,హైదరాబాద్‌:అదానీ విషయంలో కాంగ్రెస్ ఢిల్లీలో ఒకలా,గల్లీలో మరోలా మాట్లాడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ శుక్రవారం(నవంబర్‌22) తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘అదానీ అవినీతిపరుడైతే..రేవంత్‌రెడ్డి నీతిపరుడు ఎలా అవుతాడో రాహుల్‌గాంధీ చెప్పాలి. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే..తెలంగాణ సర్కార్ అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలి.

కెన్యా లాంటి చిన్న దేశాలే రద్దు చేసుకున్నప్పుడు..రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేసుకోడు?మహారాష్ట్ర వెళ్ళి అదానీని గజదొంగ అన్న రేవంత్ తెలంగాణలో మాత్రం గజ మాల వేస్తున్నాడు. అదానీతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలపై తెలంగాణ బీజేపీ వైఖరి చెప్పాలి. అదానీ వ్యవహరంతో కాంగ్రెస్,బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజువైంది. మోదీ,అమిత్ షా,రాహుల్,రేవంత్,కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి.

అదానీతో దేశానికి నష్టమైతే తెలంగాణకు నష్టం కాదా? రాహుల్ గాంధీ చెప్పాలి.స్కిల్ యూనివర్శిటీకి వంద కోట్లు తీసుకోవడం తప్పా? కాదా? కోహినూరు హోటల్లో మంత్రి పొంగులేటి,అదానీ రహస్య సమావేశం అయిన మాట వాస్తవం. అదానీతో‌ ఒప్పందాలు రేవంత్ సర్కార్ రద్దు చేసుకోవటం లేదు?అదానీ వేల కోట్ల ఒప్పందాలపై‌ రోజూ విమర్శించే రాహుల్ గాందీ సమాధానం చెప్పాలి.

రాహుల్ గాంధీకి తెలిసే రేవంత్‌రెడ్డి విరాళం తీసుకున్నారా? బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే..కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ పార్టీనా?కేసీఆర్ హాయాంలో ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణలో అదానీకి అవకాశం ఇవ్వలేదు. అదానీతో మేము ఫోటోలు దిగిన మాట వాస్తవం. అంతే మర్యాదగా బయటకు పంపించాం. రేవంత్‌రెడ్డి మాత్రం అదానీకి ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికాడు.

అదానీతో రేవంత్‌ చేసుకున్న 12,400కోట్ల రూపాయల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి. బడేబాయ్ మోదీ ఆదేశాలను చోటా బాయ్ రేవంత్ అమలు చేశాడు.తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటుకు రేవంత్ సహకారం. అదానీ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మసకబారింది. అదానీ వ్యవహరంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. రామన్నపేటలో అదానీ సిమెంట్ పరిశ్రమ వద్దని ఆందోళనా చేసినా రేవంత్ పట్టించుకోలేదు’అని కేటీఆర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌లో మిగిలేది ఆ ఐదుగురే: హరీశ్‌రావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement