లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్‌లు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో భారత చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద భారీగా తగ్గింది.
దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. లోక్‌సభ ఫలితాలకు ముందు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా.. బీజేపీ ఆ స్థాయిలో సీట్లులో రాణించకపోవడం.. అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. దీంతో అంబానీ, అదానీ నికర సంపద క్షీణించినట్లు తెలుస్తోంది.
ముఖేష్ అంబానీ 8.99 బిలియన్ డాలర్ల సందప క్షీణించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 106 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.
గౌతమ్ అదానీ నికర విలువ ఒక్క రోజులో 24.9 బిలియన్ డాలర్లు పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బుధవారం నాటికి అయన సంపద 97.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ తర్వాత భారత్‌లో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment