ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం పొందిన ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్త 'గౌతమ్ అదానీ' (Gautam Adani) విల్మర్ లిమిటెడ్‌లోని తన మొత్తం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత? విక్రయిచాలనుకుంటే దానికిగల కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వంట నూనెలు సహా ఇతర ఆహార, పానీయ ఉత్పత్తుల్ని విక్రయించే అదానీ విల్మర్‌లో గౌతమ్ ఆదానీ వాటా 43.97 శాతం ఉంది. ఈ వాటాలను మొత్తం విక్రయించడానికి మల్టీనేషనల్ కన్జూమర్ గూడ్స్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు ఇవన్నీ ఒక నెలలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
భారీ నష్టాలు
అదానీ విల్మర్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వెల్లడించిన ఫలితాల ప్రకారం ఏకంగా రూ. 130.73 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు తెలిసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 48.76 కోట్ల లాభాలను ఆర్జించిన కంపెనీ ఈ ఏడాది ఊహకందని నష్టాలను పొందాల్సి వచ్చింది. ముఖ్యంగా కుకింగ్ ఆయిల్ బిజినెస్‌లో నష్టాలు వచ్చినట్లు సమాచారం. అదానీ విల్మర్ మొత్తం వ్యయం రూ. 12,439.45 కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి: ఒక్క గ్యాడ్జెట్.. కారు మరింత సేఫ్ - ధర కూడా తక్కువే!
అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' ఇప్పటికీ కొన్ని ఆర్థిక పరమైన చిక్కులో ఉన్నట్లు.. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత ఇంకా కోలుకోలేకపోయినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రస్తుతం తన గ్రూప్‌కు చెందిన కంపెనీ వాటాల్ని మొత్తం విక్రయించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment