ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. నేడు (మంగళవారం) అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారు.
గౌతమ్ అదానీ తన పర్యటనలో భాగంగా తొలుత త్రివేణీ సంగమంలో స్నానం చేయనున్నారు. అలాగే బడే హనుమంతుని దర్శనం చేసుకోనున్నారు. అదానీ గ్రూప్.. ఇస్కాన్, గీతా ప్రెస్‌ల భాగస్వామ్యంతో మహా కుంభమేళాలో భక్తులకు పలు సేవలు అందిస్తోంది. మహాకుంభమేళా ప్రాంతంలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అదానీ గ్రూప్ మహాప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది.
గౌతమ్ అదానీ నేడు ఇస్కాన్ ఆలయంలో నిర్వహించే భండార సేవలో కూడా పాల్గొననున్నారు. మహా కుంభమేళాలో అదానీ అందిస్తున్న సేవలను చూసి భక్తులు మెచ్చుకుంటున్నారు. గీతా ప్రెస్ సహకారంతో అదానీ గ్రూప్ భక్తులకు ఆధ్మాత్మిక పుస్తకాలను వితరణ చేస్తోంది. ఈ విధంగా ఆదానీ సంస్థ ఆధ్యాత్మిక సాహిత్యం గురించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇదేవిధంగా ఆదానీ గ్రూప్ భక్తులకు ప్రయాగ్‌రాజ్‌లో ఉచిత ప్రయాణి సౌకర్యాన్ని అందిస్తోంది. ఇది మహా కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఉపయోగకరంగా ఉంది.
ఇది కూడా చదవండి: Trump oath ceremony: ‘అమెరికా ది బ్యూటీఫుల్’ గాయని ఘనత ఇదే
Comments
Please login to add a commentAdd a comment