ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జనవరి 18 వరకు 7.72 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానం చేశారు.ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం(జనవరి 19) మధ్యాహ్నం నాటికీ ఈ ఒక్కరోజే 30.80 లక్షలకు పైగా జనం సంగమంలో స్నానం చేశారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు(ఆదివారం) ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ఆయన ఈరోజు ఐదు గంటల పాటు కుంభ్ ప్రాంతంలో ఉండి, పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఈరోజు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సంగమంలో స్నానం చేసి, మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు
Comments
Please login to add a commentAdd a comment