న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ తాజాగా 2025 ఏప్రిల్‌లో మెచ్యూరిటీ కానున్న రూ. 7,374 కోట్లమేర రుణాలను తిరిగి చెల్లించింది. తాజా చెల్లింపులతో 4 కంపెనీలలో ప్రమోటర్ల వాటాలను తనఖా నుంచి తిరిగి పొందింది.
వీటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన 3.1 కోట్ల షేర్లు(4% వాటా), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు చెందిన 15.5 కోట్ల షేర్లు(11.8% వాటా)తోపాటు అదానీ ట్రాన్స్‌మిషన్‌కు చెందిన 3.6 కోట్ల షేర్లు(4.5% వాటా), అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన 1.1 కోట్ల షేర్లు(1.2% వాటా) ఉన్నట్లు పేర్కొంది.
ఈ నెలాఖరుకల్లా ఇలాంటి మరిన్ని రుణాలను ముందస్తుగానే చెల్లించనున్నట్లు తెలియజేసింది. తద్వారా గ్రూప్ రుణ భారంపై ఇన్వెస్టర్లలో తలెత్తిన ఆందోళనలకు చెక్ పెట్టే సన్నాహాలకు తెరతీసింది. కాగా.. ఫిబ్రవరి మొదట్లో చేపట్టిన చెల్లింపులతో కలిపి మొత్తం 2.016 బిలియన్ డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకున్నట్టు గ్రూప్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment