
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు షేర్ల అవకతవకలపై దర్యాప్తును సెబీ నుంచి సీబీఐకి లేదా సిట్‌కు అప్పగించాలని కాంగ్రెస్ సోమవారం సుప్రీంకోర్టును కోరింది. లేదంటే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ‘‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా ఆరోపణల నేపథ్యంలో సెబీ చైర్‌పర్సన్ మాధవి బుచ్ రాజీనామా చేయాలి.
‘మోదానీ (మోదీ + అదానీ) మెగా కుంభకోణం’పై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలి’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘‘అదానీపై దర్యాప్తును రెండు నెలల్లో ముగించాలని సుప్రీంకోర్టు 2023 మార్చి 3న ఆదేశాలు ఇచ్చింది. కానీ 18 నెలలు గడిచినా కొలిక్కి రాలేదు’’ అన్నారు.
తోసిపుచ్చిన బీజేపీ: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై జేపీసీ డిమాండ్‌ను బీజేపీ తోసిపుచి్చంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసి, పెట్టుబడుల వాతావరణాన్ని చెడగొట్టడమే కాంగ్రెస్ ఉద్దేశమని మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment