Cit
-
అదానీపై దర్యాప్తు సీబీఐకి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు షేర్ల అవకతవకలపై దర్యాప్తును సెబీ నుంచి సీబీఐకి లేదా సిట్‌కు అప్పగించాలని కాంగ్రెస్ సోమవారం సుప్రీంకోర్టును కోరింది. లేదంటే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ‘‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా ఆరోపణల నేపథ్యంలో సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్ రాజీనామా చేయాలి. ‘మోదానీ (మోదీ + అదానీ) మెగా కుంభకోణం’పై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలి’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘‘అదానీపై దర్యాప్తును రెండు నెలల్లో ముగించాలని సుప్రీంకోర్టు 2023 మార్చి 3న ఆదేశాలు ఇచ్చింది. కానీ 18 నెలలు గడిచినా కొలిక్కి రాలేదు’’ అన్నారు.తోసిపుచ్చిన బీజేపీ: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై జేపీసీ డిమాండ్‌ను బీజేపీ తోసిపుచి్చంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసి, పెట్టుబడుల వాతావరణాన్ని చెడగొట్టడమే కాంగ్రెస్ ఉద్దేశమని మండిపడింది. -
అత్యంత గౌరవంగా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు పట్ల సీఐడీ సిట్ విభాగం అధికారులు ఆద్యంతం అత్యంత గౌరవంగా వ్యవహరించారు. నంద్యాలలో శనివారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినప్పటి నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జ్యుడీషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేంతవరకు చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న 73 ఏళ్ల చంద్రబాబు పట్ల సిట్ అధికారులు అత్యంత మర్యాద పూర్వకంగా వ్యవహరించారు. నిద్ర లేచేవరకు నిరీక్షించి.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన దోషి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిట్ ఇన్చార్జ్ కె.రఘురామిరెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు నంద్యాల చేరుకుంది. ఆయన బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న టీడీపీ నేతలకు సమాచారమిచి్చంది. ఆందోళన వ్యక్తం చేసిన వారికి సిట్ అధికారులు దర్యాప్తు అంశాలను వివరించి సర్ది చెప్పారు. అప్పటికి ప్రత్యేక వాహనంలో నిద్రిస్తున్న చంద్రబాబుకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఆయన నిద్ర లేచే వరకు వేచి చూశారు. ఉదయం 5.30 గంటలకు చంద్రబాబు నిద్ర లేచి వాహనం నుంచి బయటకు వచ్చారు. సిట్ అధికారులు ఆయన్ని కలిసి కేసు గురించి వివరించారు. ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చామని తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తన ప్రమేయం లేదని, తనను ఎందుకు అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను వివరించి అరెస్ట్‌కు సహకరించాలని ఆయన్ను అధికారులు కోరారు. సంబంధిత పత్రాలపై సంతకం తీసుకున్నారు. అనంతరం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్న తరువాతే విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో గదిలో భేటీ శనివారం రాత్రి 7.50 గంటలకు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతించాలన్న వారి విజ్ఞప్తిని అధికారులు ఆమోదించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా మాట్లాడుకునేందుకు అవకాశం కలి్పంచారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబును సంప్రదించి ఆయన అడిగిన ఆహారాన్ని అందించారు. అనంతరం తన న్యాయవాదులతో కూడా విడిగా కేసు విషయాలపై బాబు చర్చించారు. నిద్రించేందుకు ప్రత్యేక గది అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు చంద్రబాబును మరోసారి విచారించారు. చంద్రబాబు కోరిన మందులను తెప్పించి ఇచ్చారు. సిట్ కార్యాలయంలో ఆయన నిద్రించేందుకు ప్రత్యేక గదిలో తగిన ఏర్పాట్లు చేశారు. అరెస్ట్ చేసినప్పటి నుంచి రిమాండ్‌కు తరలించేవరకు చంద్రబాబు సహాయకుడు మాణిక్యం ఆయన తోనే ఉండేందుకు అధికారులు అనుమతించారు. తమ అదుపులో ఉన్న చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సిట్ అధికారులు ఆద్యంతం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. తమకు సరైన సౌకర్యాలు లేవనిగానీ, అధికారులు సరిగా వ్యవహరించలేదనిగానీ చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క విమర్శ కూడా చేయకపోవడమే అందుకు నిదర్శనం. పటిష్ట భద్రతతో సెంట్రల్ జైలుకు.. ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో చంద్రబాబును విజయవాడలోని జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటల సమయంలో న్యాయస్థానానికి తరలించారు. సాయంత్రం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిన తరువాత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించారు. అనంతరం పటిష్ట భద్రతతో ఆయన్ని రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. బాబు పక్కనే దమ్మాలపాటి.. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తరువాత చంద్రబాబు కాసేపు విశ్రమించేందుకు అధికారులు అవకాశం కలి్పంచారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విచారణ ప్రారంభించారు. తన న్యాయవాదుల పేర్లను ఓ కాగితంపై రాసి వారిని లోపలకు అనుమతించాలని చంద్రబాబు కోరడంతో అందుకు దర్యాప్తు అధికారులు సమ్మతించారు. ఆయన చెప్పిన నలుగురు న్యాయవాదులను కార్యాలయంలోకి అనుమతించారు. వారితో చంద్రబాబు కాసేపు చర్చించారు. అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు ఆయన పక్కనే కూర్చొనేందుకు కూడా సిట్ అధికారులు అనుమతించడం గమనార్హం. న్యాయవాది సమక్షంలోనే విచారించారు. విచారణ సందర్భంగా కూడా అధికారులు చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన కోరిన అన్ని పత్రాలను అందించారు. వాటిని ఆయన చదివిన తరువాతే ప్రశ్నలు సంధించారు. ఆయన కోరినట్లుగానే.. నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో ప్రయాణించడం 73 ఏళ్ల చంద్రబాబుకు ప్రయాస కలిగిస్తుందని సిట్ అధికారులు భావించారు. ఆయనకు సౌకర్యవంతంగా ఉండేందుకు హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేసి అదే విషయాన్ని తెలిపారు. అయితే తాను తన వాహనంలోనే రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తానని చంద్రబాబు చెప్పడంతో అందుకు సిట్ అధికారులు సమ్మతించారు. నంద్యాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. మార్గమధ్యంలో కొన్ని చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ని కలిసేందుకు వేచి ఉన్నారు. చంద్రబాబు కోరిక మేరకు వాహనాన్ని సిట్ అధికారులు కొద్దిసేపు నిలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేసి కాసేపు మాట్లాడారు. అందుకు సిట్ అధికారులు అభ్యంతరం చెప్పకుండా సహకరించారు. చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు వాహన కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో చంద్రబాబు చెప్పేవరకు నిలిపి ఉంచారు. ఆయన సూచించిన తరువాతే కాన్వాయ్‌ను ముందుకు పోనిచ్చారు. -
లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నీలేష్ , గోపాల్, డాక్యా, రాజేందర్లు ఈ నెల 4న రాత్రి హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేసినప్పుడు వారిని మరో ఇద్దరు అభ్యర్థులు కలిసి ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలతో గుర్తించారు. వారిని నవాబ్‌పేట్, షాద్‌నగర్ ప్రాంతాలకు చెందిన ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్గా నిర్ధారించారు. డాక్యా, రేణుకల విచారణలోనూ ఇదే విషయం రుజువు కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ అభ్యర్థులిద్దరూ ప్రశ్నపత్రాన్ని రూ.18 లక్షలకు కొనేందుకు డాక్యా, ఇతరులతో ఒప్పందం కుదుర్చుకొని రూ.10 లక్షల వరకు చెల్లించారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మహబూబ్‌నగర్‌లోని సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్యతోపాటు మరో ముగ్గురు అనుమానితులను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తిరుపతయ్య... ప్రశాంత్, రాజేంద్రకుమార్లతోపాటు పలువురు ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు ఏఈ ప్రశ్నపత్రం విక్రయంలో దళారిగా వ్యవహరించాడని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. పూర్తి ఆధారాలు లభించాక అతనితోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేయాలని భావిస్తోంది. మరోవైపు గతేడాది నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల విచారణ కొనసాగుతోంది. ఆదివారం మరో 20 మంది అభ్యర్థులను అధికారులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు విచారించిన వారి సంఖ్య 50 దాటింది. అడ్డదారి తొక్కి.. అడ్డంగా బుక్కయ్యి.. షాద్‌నగర్ రూరల్: సిట్ అధికారులు తాజాగా అరెస్టు చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన రాజేంద్రకుమార్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని నేరేళ్ల చెరువు గ్రామం. నిరుపేదలైన లక్ష్మయ్య, లక్ష్మీదేవమ్మ దంపతుల నలుగురు సంతానంలో అతను పెద్ద కొడుకు. రాజేంద్రకుమార్ కొన్నేళ్లు ఉపాధి హామీ పథకంలో పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కోసం అప్పులు చేసి హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. అయితే కచ్చి తంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వద్ద ఉన్న బంగారాన్ని అమ్మడంతోపాటు ఇతరుల వద్ద అప్పు చేసి రూ.5 లక్షలకు డాక్యా నాయక్ ద్వారా ఏఈఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ బండారాన్ని సిట్ నిగ్గుతేల్చడంతో అడ్డంగా బుక్కయ్యాడు. 8 గంటలపాటు నిందితుల విచారణ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో కోర్టు అదనపు కస్టడీకి అనుమతించడంతో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్లను పోలీసులు ఆదివారం చంచల్‌గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు. దాదాపు ఎనిమిది గంటలపాటు వారిని ప్రశ్నించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయం నుంచి సీసీఎస్‌కు తరలించారు. సోమ, మంగళవారాల్లోనూ వారిని విచారించనున్నారు. -
ఇంటి దొంగలు ఎందరు? 42 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇంటి దొంగల్ని కనిపెట్టడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిషన్ కార్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్ అరెస్టు కావడం, మాజీ ఉద్యోగి సురేష్ పేరు వెలుగులోకి రావడంతో లోతుగా ఆరా తీస్తోంది. కమిషన్‌కు చెందిన వివిధ స్థాయిల ఉద్యోగులు 42 మందికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించడం ప్రారంభించింది. మరోపక్క తమ కస్టడీలో ఉన్న 9 మంది నిందితులను సిట్ అధికారులు బుధవారం ఏడు గంటల పాటు ప్రశ్నించారు. వీరి కస్టడీ గడువు గురువారంతో ముగియనుండటంతో విచారణ వేగవంతం చేశారు. బుధవారం కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సైబర్ క్రైమ్ నిపుణుల బృందం కూడా నిందితులను ప్రశ్నించింది. ఇక టెక్నికల్ టీమ్ వంతు.. టీఎస్పీఎస్సీలో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు భద్రపరిచే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ మొదలుపెట్టి అన్ని విభాగాల్లోనూ కలిపి దాదాపు 150 కంప్యూటర్లు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా టెక్నికల్ టీమ్ పని చేస్తుంటుంది. నెట్వర్క్ అడ్మిన్‌గా ఉండి, లీకేజ్ కేసులో అరెస్టు అయిన రాజశేఖర్ ఈ టీమ్‌లో కీలకంగా వ్యవహరించాడు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సిట్ అధికారులు అంతర్గత లోపాలు గుర్తించడానికి టెక్నికల్ టీమ్‌ను ప్రశ్నించాలని నిర్ణయించారు. దీంతో పా టు వీరి బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలు రాశారా? వారికి ఎన్ని మార్కులు వచ్చాయి? గతంలో వారి ప్రతిభ ఎలా ఉంది? తదితర అంశాలను దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి కోసం గాలింపు గ్రూప్ –1 ప్రిలిమ్స్ పేపర్ లీక్‌లో పాత్ర ఉన్నట్టుగా గుర్తించిన ముగ్గురు అందుబాటులో లేకపోవడంతో, వారిని నిందితులుగా అనుమానిస్తూ సిట్ గాలింపు చేపట్టింది. వీళ్లు కమిషన్ ఉద్యోగులే అని తెలుస్తోంది. 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన పదిమందిలో ఈ ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నిందితులుగా ఉన్న 9 మందికి అదనంగా మరికొందరి పేర్లు జోడిస్తూ అధికారులు గురువారం కోర్టుకు సమాచారం ఇవ్వనున్నారు. శంకరలక్ష్మిది నిర్లక్ష్యమే..? లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల పేపర్లను భద్రపరచడంలో శంకరలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ భావిస్తోంది. ఈమెకు నోటీసులు జారీ చేసి ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సంబంధించి కమిషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ పరీక్షకు ముందే ప్రవీణ్, రాజశేఖర్, సురే ష్ లతో పాటు మరెవరికైనా చేరిందా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఏఈ పరీక్ష పేపర్ క్రయవిక్రయాల్లో ప్రవీణ్, రేణుక, నీలేశ్, గోపాల్ మధ్య జరిగిన రూ.14 లక్షల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ నిపుణుల బృందం కమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న కీలక ఉద్యోగుల సెల్ఫోన్లు, వాట్సాప్ సంప్రదింపులను విశ్లేషించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రూప్–1లో 10 మంది ఉద్యోగులు పాస్ గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన కమిషన్ ఉద్యోగుల్లో ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సహా పది మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కొందరికి ఊహించని విధంగా మార్కులు వచ్చాయని సిట్ గుర్తించింది. ఇప్పటికే ఈ జాబితాను టీఎస్పీఎస్సీ నుంచి సేకరించిన అధికారులు వారికీ నోటీసులు జారీ చేసి విచారణకు సిద్ధమయ్యారు. కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న కమిషన్ ఉద్యోగిని శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచే ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయని ఇప్పటికే నిర్ధారణైంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు తనకు ఉన్న పరిజ్ఞానం వినియోగించిన రాజశేఖర్.. శంకరలక్ష్మి కంప్యూటర్లోకి అక్రమంగా చొరబడి ప్రశ్నపత్రాలు సంగ్రహించాడని తేల్చారు. ఈ విధంగా లీకేజ్ వ్యవహారంలో సైబర్ నేరమూ ఉండటంతో ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ను జోడించాలని నిర్ణయించారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచే సమయంలో దీనికి సంబంధించి మెమో దాఖలు చేయనున్నారు. -
చార్మినార్-ఫలక్‌నుమా మధ్య చక్కర్లు!
సాక్షి, హైదరాబాద్: కాలిఫట్ స్థాపనే ధ్యేయమంటూ ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు ఆకర్షితుడైన పాతబస్తీ వాసి మహ్మద్ అబుసాని కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ప్రారంభించింది. గత నెలలో ఇతడిపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీనిని రీ–రిజిస్టర్ చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో కీలకాంశాలు గుర్తించడం కోసం నిందితుడిని కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు సోమ, మంగళవారాలు విచారించారు. అబుసాని బైక్‌పై చార్మినార్–ఫలక్‌నుమా మధ్య ప్రాంతాల్లో పలుమార్లు సంచరించినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇందుకు గల కారణాలను అబుసాని నుంచి రాబట్టారు. విదేశంలో ఉన్న హ్యాండ్లర్ ఇతగాడికి సోషల్‌మీడియా ద్వారా కొన్ని లింకులు పంపించాడు. వాటిలో స్థానికంగా లభించే దీపావళి టపాసుల మందు, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితరాలు వాడి బాంబులు తయారు చేయడం ఎలా? అనే వివరాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీటి కోసమే అబుసాని ఆయా ప్రాంతాల్లో సంచరించాడని వెలుగులోకి వచ్చింది. మరికొందరిని ఉగ్రవాద బాట పట్టించడంతో పాటు నిధుల సమీకరణకు ఇతడు ప్రయత్నాలు చేశాడని చెప్తున్నారు. హ్యాండ్లర్ సహా ఇతర ప్రాంతాల్లోని స్లీపర్ సెల్స్‌తో సంప్రదింపుల జరపడానికి ఇతను ఫేస్‌బుక్‌తో పాటు 27 ఇన్‌స్ట్ర్రాగామ్ ఐడీలు, రెండు టెలిగ్రామ్ ఐడీలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా సోషల్‌మీడియా గ్రూపుల్లో ఉబ్జెకిస్థాన్తో పాటు పాకిస్థాన్‌కు చెందిన అనేక మంది సభ్యులుగా ఉన్నట్లు తేలింది. అమెరికా, ఇజ్రాయిల్‌కు సంబంధించిన ఎంబసీలను టార్గెట్ చేయాలని, బాంబు పేలుళ్లకు పాల్పడటం ద్వారా భయోత్పాతం సృష్టించాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోలు ఉన్నాయని సమాచారం. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎంబసీల వద్ద రెక్కీ చేసి, అనువైన దాన్ని గుర్తించాలని ఆన్లైన్ ద్వారా హ్యాండ్లర్ ఆదేశించాడు. ఓ పక్క అబుసాని ఈ ప్రయత్నాల్లో ఉండగానే హ్యాండ్లర్ నిర్వహిస్తున్న టెలిగ్రామ్ గ్రూపులో ఇటీవల మరో సందేశం వచ్చింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నేషనల్ క్యాపిటల్ బ్యాంక్ వద్ద పేలుడుకు సిద్ధం కావాలంటూ అందులో సూచించాడు. దీనికి తాను సిద్ధమంటూ అబుసాని అదే గ్రూపులో పోస్టు చేశాడు. బాంబుల తయారీని సూచించే లింకుల్ని ఓపెన్ చేసినట్లు పోలీసులు చెప్తున్నా ప్రయోగాలు చేశాడా? లేదా? అనే తేలాల్సి ఉందన్నారు. అబుసాని ఫోన్‌ను విశ్లేషించడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ వార్త కూడా చదవండి: కడుపులో 11.57కోట్ల కొకైన్.. -
డ్రగ్స్‌పై సిట్ వేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో 23 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డ్రగ్స్ భూతానికి బలవడం తెలంగాణ సమాజాన్ని నిర్ఘాంతపోయేలా చేసిందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్ కారిడార్‌లా, హైదరాబాద్ డ్రగ్స్‌కు కేంద్రంగా వర్ధిల్లుతోందన్న అభిప్రాయం కలుగుతోందని పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో వెంటనే జాతీయస్థాయిలో ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరుపుతున్న విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్ శుక్రవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘మొన్న కెల్విన్, నిన్న టోనీ లాంటి డ్రగ్ మాఫియా పెడ్లర్లు చాపకింద నీరులా హైదరాబాద్‌ను డ్రగ్స్ వినియోగ కేంద్రంగా మార్చుతున్న తీరుపై ఐదేళ్లుగా మేం మొత్తుకుంటున్నా.. ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. డ్రగ్స్ కేసుల్లో ప్రమేయమున్న రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను కాపాడేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్ని స్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఎన్ని టాస్క్ఫోర్సు లు వేసినా డ్రగ్స్ మాఫియా అంతం కాకపోవడానికి తెర వెనుక మీ ప్రభుత్వం చేస్తోన్న చేష్టలే కారణంగా కనిపిస్తోంది. ఈడీ మీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చింది? ఎవరిని కాపాడాలనే ఉద్దేశంతో మీరు ఈడీకి సహకరించడం లేదు? ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని హైకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత కూడా.. కేసులో తీవ్రత ఎందుకు అర్థం కావడం లేదు? రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? 65 ఏళ్ల ఉమ్మడి పాలనలో హైదరాబాద్‌లో మొత్తం ఆరు పబ్‌లకు అనుమతిస్తే.. టీఆర్ఎస్ అధికా రంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో 60కి చేరాయి. హైదరాబాద్ శివార్లలో మూతబడ్డ పలు ఫార్మా కంపెనీలు డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మారాయి. ఇవన్నీ చూస్తుంటే మీరు రాష్ట్రాన్ని ఎటు వైపు తీసుకెళుతున్నారో అర్థం కావడం లేదు. యువత చైతన్యంగా ఉంటే ఉద్యోగాలు, ఉపాధి అడుగుతారనే ఉద్దేశంతో డ్రగ్స్‌కు బానిసలను చేయాలన్న సంకుచిత బుద్ధి ఉందా? డ్రగ్స్ బాధిత మరణంతోౖ నెనా ప్రభు త్వం బుద్ధి మార్చుకోవాలి. తక్షణమే డిజిటల్ రికార్డులన్నీ ఈడీకి అందజేయాలి. కేసు విచారణ కోసం జాతీయ స్థాయి సిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ డీఆర్ఐ, ఎన్సీబీ, ఈడీలకు ప్రధానికి లేఖ రాయాలి. లేకుంటే డ్రగ్స్ విషయం లో రాష్ట్ర ప్రభుత్వాన్నే దోషిగా భావించాల్సి ఉంటుంది..’’అని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మీ ఎమ్మెల్యేలను కాపాడుతున్నారా? బెంగళూరులో నమోదైన డ్రగ్స్ కేసులో మీ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి కదా. వారిని మీ ప్రభుత్వమే కాపాడినట్టు ఆరోపణలు వస్తుం టే మీరెందుకు స్పందించరు? 2017లో సినీ ప్రముఖుల విచారణ తర్వాత అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆకస్మిక బదిలీ వెనుక ఏం జరిగింది? రాజకీయ, సినీ ప్రముఖులను కాపాడటంపై ఉన్న శ్రద్ధ డ్రగ్స్‌ను నియంత్రించడంపై ఎందుకు ఉండటం లేదు? ఈ ఏడాది జనవరి 20న అరెస్టయిన టోనీ నుంచి నగరానికి చెందిన పారిశ్రామికవేత్తలు రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు విచా రణలో తేలిన విషయం మర్చిపోయారా? -
ఖాకీలందరికీ క్లీన్చిట్
-
నయీం కేసులో ఖాకీలందరికీ క్లీన్చిట్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీంతో పోలీసులెవరూ అంటకాగలేదట. అత నితో పోలీసులెవరికీ ఎలాంటి సంబంధాలు లేవట. నాలుగేళ్ల దర్యాప్తు తర్వాత పోలీసుశాఖ ఇదే విషయాన్ని తేల్చింది. నయీంతో కలిసి పలు భూ సెటిల్మెంట్లు, అక్రమ దందాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులందరికీ డిపార్ట్ మెంట్ క్లీన్చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు వచ్చిన రాజకీయ నేతలంతా ఇప్పటికే ఊపిరి పీల్చు కోగా.. తాజాగా అడిషనల్ ఎస్పీ నుంచి కానిస్టేబుల్ దాకా 25 మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తోన్న ఐజీ నాగిరెడ్డి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానమిస్తూ క్లీన్చిట్ విషయాన్ని వెల్లడించారు. 2016 ఆగస్టులో షాద్‌నగర్ సమీపంలోని మిలీనియం టౌన్షిప్ వద్ద జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ నయీం హతమైన సంగతి తెలిసిందే. ఆ తరువాత అతని నేరాలు, అకృత్యాలపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను వేసింది. నయీం నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పాల్పడిన పలు భూసెటిల్మెంట్లు , కిడ్నాపులు, హత్యలకు రాజకీయ నాయకులు, పోలీసులు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. నయీంను కలిసిన పలువురు రాజకీయ నాయకులు, పోలీసుల ఫొటోలను అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సిట్ వారిని విచారించింది. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతోపాటు హెడ్ కానిస్టేబుల్ల వరకు మొత్తం 25 మందికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, అందుకే వీరిని కేసు నుంచి తప్పిస్తున్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చేసుకున్న ఆర్టీఐ దరఖాస్తుకు సిట్ చీఫ్ ఐజీ నాగిరెడ్డి సమాధానమిచ్చారు. క్లిన్‌చిట్ పొందింది వీరే.. అడిషనల్ ఎస్పీలు శ్రీనివాస్ రావు, చంద్రశేఖర్. డీఎస్పీలు ఈజి శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, సాయి మనోహర్, ప్రకాష్ రావు, వెంకట నరసయ్య, అమరేందర్ రెడ్డి తిరుపతన్నలు ఉన్నారు. ఇక ఇన్స్పెక్టర్లు మస్తాన్, రాజగోపాల్, వెంకటయ్య, శ్రీనివాస్ నాయుడు, కిషన్, ఎస్ శ్రీనివాసరావు, వెంకట్ రెడ్డి, మజీద్, వెంకట సూర్య ప్రకాష్, రవి కిరణ్ రెడ్డి, బలవంతయ్య , నరేందర్ గౌడ్, రవీందర్ ఉన్నారు. కేసును సీబీఐకి అప్పగించండి నయీం కేసుల నుంచి పోలీసుల పేర్లను తొలగించడంపై ఎఫ్‌జీజీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసు విచారణ సరిగా జరగడం లేదని, వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైకి ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శనివారం లేఖ రాశారు. నయీం ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని, 4 ఏళ్లుగా కేసును సిట్ దర్యాప్తు చేస్తున్నా... బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 240 కేసులు నమోదు చేస్తే.. ఇప్పటివరకు 173 కేసుల్లోనే చార్జిషీట్లు నమోదు చేశారని, నయీం ఇంటి వద్ద లభించిన డబ్బు విషయంలోనూ నిజాలు దాస్తున్నారని ఆరోపించారు. -
విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణ
-
థూథూ.. మంత్రంగా దర్యాప్తు
-
సిట్ దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సాగిస్తున్న దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలియజేయాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు పురోగతిపై ఓ నివేదికను పరిశీలన నిమిత్తం మంగళవారం నాటికి తమ ముందుంచాలని పేర్కొంది. సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) నియంత్రణలో ఉన్న విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం ఘటన జరిగి నందున, వారి పరిధిలోకి ఏయే అంశాలు వస్తాయో స్పష్టతనివ్వాలని సీఐఎస్ఎఫ్, ఏఏఐ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ‘సిట్’కు నేతృత్వం వహిస్తున్న అధికారి, ఆ బృందంలో ఉన్న ఇతర అధికారుల వివరాలను తమ ముందుంచాలని సూచించింది. జగన్‌పై హత్యాయత్నం ఘటనపై జరుగుతున్న దర్యాప్తును తాము పర్యవేక్షించబోమని తేల్చిచెప్పింది. హత్యాయత్నం ఘటనకు సంబంధించి పోలీసులకు వాంగ్మూలం ఇవ్వాలా? లేదా? అనేది జగన్ ఇష్టమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన వాంగ్మూలం ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను నవంబర్ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణ, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హత్యాయత్నం ఘటనను తక్కువ చేస్తూ మాట్లాడారు తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ తరపున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) కూడా దాఖలైంది. ఈ మూడు వ్యాజ్యాలపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. హత్యయత్నం ఘటన జరిగిన గంట తరువాత డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ, ప్రచారం కోసమే జగన్‌పై నిందితుడు దాడి చేశారని చెప్పారని అన్నారు. అదేరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ సానుభూతి కోసమే జగన్‌పై దాడి జరిగిందని వ్యాఖ్యానించారని తెలిపారు. జగన్‌పై దాడి వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆపరేషన్ గరుడ అంటూ సినీనటుడు శివాజీ చెప్పిన కథలను కూడా ముఖ్యమంత్రి వివరించారన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడిన మాటలను మోహన్‌రెడ్డి ధర్మాసనానికి చదివి వినిపించారు. చంద్రబాబు దాదాపు గంటన్నరసేపు మీడియాతో మాట్లాడితే, జగన్‌పై హత్యాయత్నం ఓ డ్రామా అంటూ వందసార్లు చెప్పారని గుర్తుచేశారు. ఈ హత్యాయత్నం ఘటనను ముఖ్యమంత్రి, డీజీపీ తక్కువ చేస్తూ మాట్లాడారని, అంతేకాక దర్యాప్తు ఏ దిశగా వెళ్లాలో చెప్పకనే చెప్పారని కోర్టుకు నివేదించారు. సీఎం చెప్పింది తప్పని పోలీసులు చెప్పగలరా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే వాస్తవాలను తెలుసుకోకుండా హత్యాయత్నాన్ని డ్రామాగా తేల్చేసినప్పుడు ఆయన కింద పనిచేసే పోలీసులు అందుకు భిన్నంగా ఎలా వాస్తవాలను బహిర్గతం చేయగలరని మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం చెప్పిన మాటలకు భిన్నంగా మాట్లాడే ధైర్యం ఏ అధికారికి ఉంటుందని అన్నారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే పరిస్థితి లేదు కాబట్టే తాము స్వతంత్ర సంస్థతో దర్యాప్తును కోరుతున్నామని పేర్కొన్నారు. రాజకీయ సానుభూతి కోసమే ఈ దాడి జరిగినట్లు ముఖ్యమంత్రి చెప్పారని, ఇది చాలా తీవ్రమైన ప్రకటన అని అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ముఖ్యమంత్రికి కూడా వాక్ స్వాతంత్య్రం ఉందని, రాజకీయ సానుభూతి అన్నది ఆయన అభిప్రాయమని వ్యాఖ్యానించింది. దీనిపై మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. వాక్ స్వాతంత్య్రాన్ని ఎవరూ కాదనరని, అయితే ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సంగతి మర్చిపోయి మాట్లాడటం సమంజసం కాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఇంతకీ పిటిషనర్ పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారా? సిట్‌కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అని ఆరా తీసింది. డీజీపీ, ముఖ్యమంత్రి ప్రకటనల నేపథ్యంలో దర్యాప్తు సక్రమంగా జరిగే అవకాశమే లేదని, అందువల్ల స్వతంత్ర సంస్థ దర్యాప్తును కోరుతున్నామని మోహన్‌రెడ్డి చెప్పారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే పిటిషనర్ వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. జగన్‌పై జరిగిందని హత్యాయత్నమేనని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జగన్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తి వైఎస్సార్సీపీ సానుభూతిపరుడుని చెప్పేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తూ వచ్చారని వివరించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు చేయకపోతే.. జగన్‌కు అయిన గాయం విషయంలోనూ ముఖ్యమంత్రి అవాస్తవాలే చెప్పారని మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. క్రిమినల్ లా ప్రకారం వాంగ్మూలం ఇచ్చే విషయంలో ఆలస్యం అయ్యే కొద్ది జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసులందరూ తమ రాజకీయ బాస్‌ల తాళానికి అనుగుణంగా నృత్యం చేస్తారని తాము భావించడం లేదని తెలిపింది. సమస్య ఇక్కడే వస్తోందని, అధికారులు రాజ్యాంగం కన్నా తమ రాజకీయ బాస్‌లకే ఎక్కువ నమ్మకంగా ఉంటూ, వారి అడుగులకు మడుగులొత్తుతున్నారని మోహన్‌రెడ్డి చెప్పారు. ఒకవేళ అలా చేయకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆ అధికారులకు తెలుసని, వారికి మరో ప్రత్యామ్నాయం లేక అలా చేస్తుంటారని ఆయన తెలిపారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ.. దర్యాప్తునకు సహకరించకుండా పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపించడం అభ్యంతరకరమని అన్నారు. దర్యాప్తునకు సహకరించేలా పిటిషనర్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తును తాము పర్యవేక్షించబోమని తేల్చిచెప్పింది. పోలీసులకు జగన్మోహన్రెడ్డి వాంగ్మూలం ఇవ్వాలా? లేదా? అన్నది ఆయన ఇష్టమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. -
చట్ట ప్రకారమే విచారించండి
► చార్మీ పిటిషన్‌పై ఎక్సైజ్ సిట్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించే హీరో యిన్ చార్మీ కౌర్‌ను విచా రించాలని డ్రగ్స్ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎక్సైజ్ సిట్) అధికారు లను హైకోర్టు ఆదేశిం చింది. చార్మీ ఇష్టానికి విరుద్ధంగా ఆమె రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూ నాలను సేకరించవద్దని.. ఈ విషయంగా ఆమెపై ఒత్తిడి చేయవద్దని సూచిం చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, మహిళా అధికారుల సమక్షంలో మాత్రమే ప్రశ్నించాలని పేర్కొంది. విచారణ పూర్తికాకుంటే మరుసటి రోజు కొనసా గించవచ్చని సూచించిం ది. ఈ కేసులో ప్రస్తుతం చార్మీ సాక్షి మాత్రమేనని, నిందితురాలు కాదు కాబట్టి విచారణ సమ యంలో న్యాయవాది అవసరం లేదని స్పష్టం చేసింది. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న చార్మీ.. తనను న్యాయవాది, మహిళా అధికారుల సమక్షంలో విచారించేలా.. బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను తీసుకోకుండా అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈవ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు. బలవంతంగా చేస్తున్నారు.. తొలుత చార్మీ తరఫున న్యాయవాది పి.విష్ణువ ర్ధన్‌రెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్ వ్యవహా రానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు జూలై 12న చార్మీకి నోటీసులు ఇచ్చి, 26న హాజరు కావాలని ఆదేశించారని తెలిపారు. సిట్ అధికారులు ఇలా విచారణకు పిలిచిన వారి నుంచి బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. చార్మీ విషయంలోనూ అలాగే జరిగే అవకాశముందని.. ఇది హక్కు లను ఉల్లంఘించడమేనన్నారు. ఈ కేసులో చార్మీ నిందితురాలుగానీ, అనుమానితురాలు గానీ కాదని.. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విచారణ సమయంలో న్యాయవాదిని వెంటబెట్టుకు నేందుకు అనుమతించాలని కోరారు. బలవంతమేమీ లేదు అనంతరం ఎక్సైజ్ సిట్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్ వాదనలు వినిపించారు. విచా రణ జరిపే చోటును నిర్ణయించుకునే వెసు లుబాటును చార్మికే ఇచ్చామని.. అయినా ఆమె స్వచ్ఛందంగా సిట్ కార్యాలయానికి వచ్చేందుకు అంగీకరించారని కోర్టుకు వివ రించారు. సిట్ అధికారులు ఎవరి నుంచీ బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకోవడం లేదన్నారు. సోమవారం హీరో నవదీప్ నమూనాలు ఇచ్చేందుకు తిరస్కరించారని, దాంతో అధికారులు నమూనాలేవీ సేకరించలేదని తెలిపారు. మహిళా అధికారుల సమక్షం లోనే చార్మిని విచారిస్తామని.. ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నం దున న్యాయవాది కూడా అవసరం లేదని కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాద నలు విన్న న్యాయమూర్తి మధ్యాహ్నం 2.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
సీబీఐకి అప్పగించే ప్రసక్తే లేదు
నయీం కేసుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ - మనకు సమర్థులైన పోలీసులున్నారు - రాష్ట్ర పోలీసులకే ఈ క్రెడిట్ దక్కాలి - కేసుతో సంబంధం ఉన్న ఎవరినైనా శిక్షించి తీరుతాం - నయీం పిశాచాన్ని సృష్టించింది ఎవరో ప్రపంచానికి తెలుసు - నాడు కళ్లు మూసుకొని రాజ్యం చేసింది ఎవరు? - కేసు దర్యాప్తులో ఎక్కడా ఉదాసీనత లేదు - 740 మందికి పైగా సాక్షులను విచారించి 124 మందిని అరెస్టు చేశారు.. దర్యాప్తు మధ్యలో ఉంది.. - సమయం, సందర్భాన్ని బట్టి అన్నీ బయటపెడతాం సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించేది లేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తేల్చి చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రశంసలందుకునే సమర్థులైన పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నందున వారితోనే దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో నయీం, అతని అనుచరులు సాగించిన నేర కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై లఘు చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున సీఎం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నయీం ఎన్కౌంటర్ తర్వాత తనకు వేలాది మంది ఫోన్లు చేశారని, కన్నీళ్లు పెట్టుకుంటూ అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. భువనగిరి వెళ్తే వేలాది మంది వచ్చి ‘మా దరిద్రాన్ని వదిలించారు..’ అంటూ సంతోషించారని చెప్పారు. నయీంను హతమార్చడంలో మన పోలీసులు చేసిన కృషి అభినందనీయమని, అందుకే ఈ కేసు దర్యాప్తు చేసిన క్రెడిట్ మన పోలీసులకే దక్కాలని, సీబీఐకి ఈ కేసు ఇవ్వడం లేదని అన్నారు. ‘‘మన పోలీసులు బెస్ట్ పోలీసింగ్ అవార్డులు అందుకుంటున్నారు. జాతీయ పోలీసు అకాడమీకి వచ్చిన సందర్భంగా ప్రధాని కూడా మన పోలీసులను ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి కితాబిచ్చారు. అలాంటి పోలీసులను ఉపయోగించుకునే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేస్తాం’’ అని చెప్పారు. ‘‘నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. నయీంను హతమార్చింది, ఆ తర్వాత 124 మంది అతని అనుచరులను పట్టుకుంది ఎవరు? సీబీఐ వాళ్లు వచ్చి పట్టుకున్నారా..?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. నయీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై అపవాదు వేయాలనుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఈ పిశాచాన్ని ప్రోత్సహించింది ఎవరు? అసలు నయీం అనే ఈ పిశాచం సృష్టికర్తలెవరో ప్రపంచానికి తెలియదా అని సీఎం ప్రశ్నించారు. ‘‘ఆ పిశాచం నమిలి మింగుతుంటే ప్రోత్సహించింది ఎవరు? కళ్లు మూసుకుని రాజ్యం చేసింది ఎవరు’’ అంటూ కాంగ్రెస్, టీడీపీలను పరోక్షంగా విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోని వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని, పేకాట, గుడుంబాలపై ఉక్కుపాదం మోపి అణచివేశామని సీఎం చెప్పారు. శాంతిభద్రతల విషయంలో తాము చాలా కఠినంగా ఉంటున్నామని, నయీం కాదు ఆయన తాత అయినా ఈ ప్రభుత్వం క్షమించదని స్పష్టం చేశారు. ఎక్కడా ఉదాసీనత లేదు.. నయీం ఉదంతంలో ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఎక్కడా ఉదాసీనంగా వ్యవహరించడం లేదని, ఏ విషయాన్ని కూడా దాచిపెట్టడం లేదని సీఎం స్పష్టంచేశారు. నయీంను ప్రాణాలతో పట్టుకుని ఉంటే బాగుండేదని, అయితే పోలీసులపై నయీం ముఠా కాల్పులకు దిగడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నయీం హతమయ్యాడని పేర్కొన్నారు. ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు సమర్థంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని, ఇప్పటి వరకు నయీం ఉదంతంలో 740 మందికి పైగా సాక్షులను విచారించి 124 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. నయీం ముఠాకు మొత్తం 52 హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారని, అందులో 26–27 కేసుల్లో సాక్ష్యాధారాలు కూడా లభ్యమయ్యాయని తెలిపారు. ఇప్పటికే రెండు చార్జిషీట్లు వేశారని, ఇంకో 10–15 చార్జిషీట్లు వేసేందుకు సిద్ధమయ్యారని వివరించారు. కేసు దర్యాప్తు మధ్య దశలో ఉన్నందున అన్ని విషయాలను బయటపెట్టడం కుదరదని, కేసును తేల్చాలంటే పోలీసులు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. అయినా దర్యాప్తులో ఇప్పటివరకు తేలిన అంశాలన్నింటినీ సభ ముందుంచామన్నారు. నయీం కేసు చాలా సున్నితమైనది కనుక అన్ని విషయాలను బయటకు వెల్లడించలేమని, సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని అంశాలను బహిర్గతం చేస్తామని, అన్ని చరిత్రలు బయటకు వస్తాయని చెప్పారు. నయీం ముఠా అవశేషాలను కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారెవరైనా, ఏ పార్టీలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా నూరు శాతం శిక్షించి తీరుతామని, ఎవరినీ ఉపేక్షించాలన్న పిచ్చి ఆలోచన ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవడ్రా నయీం.. ఏమనుకుంటున్నవ్..? తన ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్ కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. టీఆర్ఎస్ నేత సాంబశివుడి హత్య జరిగిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్లానని, అప్పుడు అక్కడ జరిగిన సంస్మరణ సభలోనే నయీం దురాగతాల్ని ప్రశ్నించానని గుర్తు చేశారు. వలిగొండ సభలో ‘‘ఎవడ్రా నయీం.. ఏమనుకుంటున్నవ్... దేవుడు నీకేమైనా ఆరుచేతులిచ్చిండా.. నువ్వు చేసే పని మేం చేస్తే ఎట్టుంటది...?’’ అని ప్రశ్నించానని చెప్పారు. ఈ మాటల తర్వాత కేసీఆర్ భువనగిరి దాటి వెళ్తాడా అని కూడా వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతటి స్థాయిలో నయీం అనే పిశాచి పాతుకుపోయినా ఏమీ చేయలేక పోయారని కాంగ్రెస్, టీడీపీలను విమర్శించారు. ‘‘మేం 15 ఏళ్లు పడుకున్నం. ఇప్పుడు మీకు రెండేళ్లు ఎందుకు పట్టింది’’ అని ప్రతిపక్షాలు ప్రశ్నించడం అన్యాయమని అన్నారు. నయీం ఉదంతంపై సీఎం ప్రసంగం తర్వాత మళ్లీ జీవన్‌రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించినా సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. -
నయీమ్‌పై సెంచరీ దాటిన ఫిర్యాదులు!
నాలుగు రోజుల్లో టోల్‌ఫ్రీ నంబర్‌కు 124 ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అరాచకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫిర్యాదులు స్వీకరించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 124 ఫిర్యాదులు వచ్చాయి. నయీమ్ ఎన్ కౌంటర్లో మరణించినా.. తొలుత ఫిర్యాదులు చేసేందుకు బాధితులు వెనుకాడారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు మొదటి రోజు కేవలం 14 ఫిర్యాదులే వచ్చాయి. దీంతో ఫిర్యాదులను గోప్యంగా ఉంచుతామని, బాధితులు ముందుకు రావాలని సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి ప్రకటించడంతో.. ఫిర్యాదులు పెరిగాయి. ఈ నాలుగు రోజుల వ్యవధిలో 124 ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వాటిలో ఎక్కువ భాగం నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే వచ్చినట్లు తెలిసింది. రియల్ ఎస్టేట్, భూలావాదేవీల సెటిల్మెంట్లు, బలవంతపు వసూళ్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. కిడ్నాపింగ్‌కు సంబంధించి 22 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. అయితే ఫిర్యాదులన్నీ కూడా నయీమ్ అనుచరులు తమ భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వాటిని తిరిగి ఇప్పించాలంటూ వస్తున్నాయి. దీంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఫిర్యాదు చేసే వారు ఆధారాలేమైనా ఉంటే పోలీసు స్టేషన్లలో అందజేయాలని, న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయని నచ్చచెబుతున్నారు. ఇక పలు ఫిర్యాదుల్లో సిట్ అధికారులకు సందేహాలు తలెత్తుతున్నాయి. భూలావాదేవీలకు సంబంధించిన సెటిల్మెంట్లలో వాస్తవమెంత, నిజమైన బాధితులెవరనే విషయాన్ని తేల్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఫిర్యాదులను సంబంధిత పోలీస్స్టేషన్లకు పంపి పరిశీలన చేయిస్తున్నారు. సిట్ కస్టడీకి నయీమ్ బంధువులు నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేశారు. వారిలో కీలకంగా భావిస్తున్న భార్య హసీనా, అక్క సలీమాతో పాటు ముఖ్య అనుచరులను కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయనుంది. ఇప్పటికే కొందరిని విచారించేందుకు అవకాశమివ్వాలని కోర్టును కోరింది. వరుస సెలవుల నేపథ్యంలో ఈ విజ్ఞప్తిపై విచారణ జరగలేదు. మంగళవారం అనుమతి వచ్చే అవకాశముంది. నయీమ్ అరాచకాలన్నీ అతడి భార్య హసీనా, సోదరి సలీమాకు తెలుసనని.. వారి ఆ సమాచారాన్ని రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. -
రంగంలోకి సిట్
నయీమ్ కేసులపై దర్యాప్తునకు ప్రత్యేక బృందం నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో 8 మంది అధికారులతో నియామకం ఇప్పటివరకు నమోదైన 11 కేసులు సిట్‌కు బదిలీ నయీమ్ డైరీలోని అంశాలపై లోతుగా ఆరా తీయనున్న బృందం గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్ కేసు సైబరాబాద్ డీఎస్పీకి హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తదనంతర పరిమాణాలపై నమోదైన కేసులను పకడ్బందీగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. నయీమ్ చీకటి సామ్రాజ్యాన్ని ఛేదించేందుకు డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో ఒకరు ఏఎస్పీ స్థాయి ర్యాంకు కలిగిన అధికారి కాగా మిగతా ఏడుగురు వివిధ ప్రాంతాలు, విభాగాల్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లు. నయీమ్ అక్రమాస్తులు, నేరప్రవృత్తి, వెలుగుచూస్తున్న ల్యాండ్ డాక్యుమెంట్లు, మారణాయుధాలు తదితర అంశాలపై సిట్ దృష్టి సారించింది. మరోవైపు నయీమ్ ఎన్కౌంటర్ కేసును సైబ రాబాద్ పరిధిలోని డీఎస్పీ ర్యాంకు కలిగిన ఒక అధికారికి అప్పగించారు. జాతీయ మానవహక్కుల కమిషన్ నియమాల ప్రకారం ఎన్‌కౌంటర్‌పై విచారణకు వేరే జిల్లాకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారిని నియమించాలి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. తుపాకులు, తూటాలు ఎలా వచ్చాయి? వివిధ కేసుల్లో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారితోపాటు అదుపులోకి తీసుకున్నవారి నుంచి భారీగా ఆయుధాలు లభ్యమవుతున్నాయి. వీరికి తుపాకులు, తూటాలు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఎవరు సమకూర్చారు? అనే కోణంలో ఆరా తీయాలని సిట్ యోచిస్తోంది. అలాగే వారి వ్యక్తిగత ఖాతాల్లో పెద్దఎత్తున డబ్బు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడెక్కడి నుంచి నిధులు వచ్చాయనే దానిపైనా ఆరా తీస్తున్నారు. ఈ కేసుల్లో కీలకమైదిగా భావిస్తున్న నయీమ్ డైరీపైనా సిట్ దృష్టి సారించింది. డైరీలో పలువురు ఐపీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం. శంషాబాద్ డీసీపీ స్వాధీనం చేసుకున్న నయీమ్ 2 డైరీలను సిట్ సభ్యులు అధ్యయనం చేస్తున్నారు. కాగా షాద్‌నగర్‌లోని మిలీ నియం టౌన్షిప్ కాలనీలో గ్యాంగ్‌స్టర్ నయీ మ్ నివాసం ఉన్న ఇంట్లో నాగిరెడ్డి సోదాలు నిర్వహించారు. సిట్ టీమ్ సభ్యులు వీరే: సిట్‌కు నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి నేతృత్వం వహించనున్నారు. బి.శ్రీనివాస్‌రెడ్డి (అడిషనల్ డీసీపీ క్రైమ్స్, సైబారాబాద్), శ్రీధర్(ఇన్స్పెక్టర్ బేగంబజార్, హైదరాబాద్), ఎస్.సుధాకర్(ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్), షకీర్ హుస్సేన్ (వనపర్తి ఇన్స్పెక్టర్), రాజశేఖర్ రాజు(కోరుట్ల ఇన్స్పెక్టర్), సామల వెంకటేష్ (సీసీఎస్ సంగారెడ్డి ఇన్స్పెక్టర్), పి.మధుసూదన్‌రెడ్డి (కోదాడ ఇన్స్పెక్టర్), సీతారామ్(ఆర్మూరు ఇన్స్పెక్టర్) సిట్‌లో సభ్యులుగా ఉన్నారు. కేసులన్నీ సిట్‌కు బదిలీ రాష్ట్ర వ్యాప్తంగా నయీమ్ ఎన్కౌంటర్ తదనంతరం వివిధ ప్రాంతాల్లో 11 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నార్సింగి, వనస్థలిపురంతోపాటు నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైన కేసులను సిట్‌కు బదిలీ చేశారు. నయీమ్ అనుచరులుగా భావిస్తున్న దాదాపు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నయీమ్ ఇంట్లో వంట మనిషి ఫర్హాన్, నయీమ్ డ్రైవర్ భార్య ఆసియా, ముఖ్య అనుచరులు శ్రీధర్‌గౌడ్, రియాజుద్దీన్, ఫయీమ్ తదితరులను అరెస్టు చేశారు. వీరి నుంచి నయీమ్ అక్రమాలకు సంబంధించి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వెలుగు చూసిన సమాచారం ఆధారంగా దర్యాప్తును మరింత పకడ్బందీగా చేసేందుకు సిట్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పలు జిల్లాలో వందల ఎకరాల భూములు, ప్లాట్లు, నివాస సముదాయాలు ఉన్నందున రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల సాయంతో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. -
గుడి పదిలం
లౌకిక ప్రపంచంలో అలౌకిక ఆనందాన్ని పంచే ఆధ్యాత్మిక సౌధం ఆలయం. సనాతన ధర్మానికి వేదికగా.. సంస్కృతి, సాంప్రదాయాలకు వారధిగా నిలిచిన గుళ్లు కాల క్రమంలో గత వైభవాన్ని కోల్పోతున్నాయి. దేవాలయాలు, వాటి చుట్టూ పెనవేసుకుని ఉన్న జీవనాన్ని పరిరక్షించుకునే పని పెట్టుకున్నారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అండ్ సేవ్ టెంపుల్స్ డాట్ ఓఆర్జీ. అందులో భాగంగానే నగరంలో శుక్రవారం ‘సేవ్ టెంపుల్స్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్స్ స్క్రీనింగ్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీలైన్‌తో రూపొందిన లఘుచిత్రాలు ఈ పండుగలో కనువిందు చేయనున్నాయి.ఈ స్క్రీనింగ్ ఈ నెల 24 వరకు కొనసాగుతుంది. ఇవాళ్టి నుంచి చిత్రాలు ప్రదర్శించనున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ రెండు రోజులు ఉదయం 9.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శిస్తారు. గుళ్లు, ఆలయాల్లోని శిల్పసంపద, గుడి మాన్యా లు, గోశాలలు, ఆలయాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్న వృత్తులు.. తదితరాలు ఈ లఘుచిత్రాల్లో ముఖ్యాంశాలు. ఈ షార్ట్ ఫిల్మ్స్ రూపొందించిన వాళ్లలో మహిళలు కూడా ఉన్నారు. వారిగురించి... శంకరా... నా పేరు మంజుల. వృత్తిరీత్యా గవర్నమెంట్ టీచర్ని. షార్ట్ ఫిల్మ్స్ తీయడం హాబీ. సాంఘిక సమస్యల మీద నాలుగు సినిమాలు తీశా. ఈ ఫెస్టివల్లో స్క్రీనింగ్ అవుతున్న నా సినిమా పేరు ‘శంకరా’. అర్చకుడిగా ఉన్న తండ్రి కష్టాలను చూసిన కొడుకు... దీన్ని నమ్ముకొంటే బతుకు లేదని తలచి, ఉన్నత చదువుల కోసం నగరానికి వెళ్తాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి కోసం మళ్లీ ఊరికొస్తాడు. తండ్రి వారసత్వంగా అర్చక వృత్తిని స్వీకరించడానికి తపన పడతాడు. ఇది చూసిన పూజారి మనవడు.. తాత వారసత్వాన్ని తీసుకోవడానికి సిద్ధపడతాడు. అదీ కథ. ఆలయ సంస్కృతిని కాపాడుకోవాలంటే అర్చకత్వం ఉండాలి. ఈ సినిమా ద్వారా ఆ పరంపర కొనసాగాలనే సందేశం ఇచ్చాను. నేనిప్పటి వరకు తీసిన మూడు షార్ట్‌ఫిల్మ్స్‌కు అవార్డులు వచ్చాయి. డ్యూటీస్ ఆఫ్ ప్రీస్ట్... నా పేరు రేణుకారెడ్డి. మాది బెంగళూరు. నేను తీసిన సినిమా.. డ్యూటీస్ ఆఫ్ ప్రీస్ట్. దేవాలయాల సంరక్షణలో అర్చకులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు. పూజారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, దేవాలయాలతో ప్రజలు మమేకం కావాలన్నా.. పూజారులు ఎలా ప్రవర్తించాలి. ప్రజలతో ఎలా మమేకం కావాలన్న థీమ్‌తో ఈ సినిమా తీశాను. నేను వృత్తిరీత్యా థియేటర్ ఆర్టిస్ట్‌ని. షార్ట్మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం.