ప్రాజెక్టుల ఏర్పాటుకు లంచం.. స్పందించిన అదానీ గ్రూప్‌ | Adani Group Says Conglomerate Has Not Received Any Notice | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల ఏర్పాటుకు లంచం.. స్పందించిన అదానీ గ్రూప్‌

Published Wed, Mar 20 2024 9:07 AM | Last Updated on Wed, Mar 20 2024 12:26 PM

Adani Group Said That Conglomerate Has Not Received Any Notice - Sakshi

భారత్‌లో ప్రాజెక్టుల ఏర్పాటుకై అదానీ గ్రూప్‌ ప్రతినిధులు లంచం ఇవ్వజూపారంటూ వస్తున్న ఆరోపణల విషయంలో అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ స్పందించింది. అలా వస్తున్న కథనాలు, వార్తలు పూర్తిగా అవాస్తవమని గ్రూప్‌ ప్రతినిధులు వెల్లడించారు.

ఆ ఆరోపణలకు సంబంధించి అమెరికా న్యాయశాఖ నుంచి ఎలాంటి నోటీసు అందలేదని సంస్థ తన ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ దర్యాప్తు గురించి తమకు తెలియదని, భారత్‌తో సహా ఇతర దేశాల్లోని అవినీతి నిరోధక చట్టాలకు తాము కట్టుబడి ఉన్నామని గ్రూప్‌ పేర్కొంది.

భారత్‌లో ఒక ఇంధన ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు, భారత అధికారులకు అదానీ గ్రూప్‌ లేదా ఆ గ్రూప్‌లోని వ్యక్తులు ఎవరైనా లంచం ఇవ్వజూపారా లేదా అన్నది తెలుసుకోవడానికి అమెరికా దర్యాప్తు చేపట్టినట్లు బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో పేర్కొంది. అమెరికా మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ ట్రేడ్‌ కానప్పటికీ అమెరికన్ల పెట్టుబడులు ఆ సంస్థలో ఉన్న నేపథ్యంలో యూఎస్‌ ప్రభుత్వం దర్యాప్తు చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ‘మళ్లీ డ్రగ్స్‌ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి

ఈ నేపథ్యంలో ఆ దేశ అటార్నీ జనరల్‌ ఆఫీస్‌, జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఫ్రాడ్‌ యూనిట్‌ ఈ విచారణ జరుపుతున్నట్లు వార్తా కథనం ద్వారా తెలిసింది. దేశీయ ఎనర్జీ కంపెనీ అజ్యూర్‌ పవర్‌ గ్లోబల్‌పైనా దృష్టిపెట్టినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement