పునరుత్పాదక ఇంధన వనరులపై అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ సామర్థ్యంతో సోలార్, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై వచ్చే ఐదేళ్లలో 35 బిలియన్ డాలర్లు (రూ.2.94 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ ప్రకటించారు. ‘2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువ నాయకుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సీఈవో ప్యానెల్ చర్చలో భాగంగా సాగర్ అదానీ ఈ వివరాలు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!
గుజరాత్‌లోని ఖావ్డాలో 30,000 మెగావాట్ సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇంధన స్థిరత్వం, ఇంధన పరివర్తనం విషయంలో అదిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడుల్లో ఇది ఒకటి అవుతుందని సాగర్ అదానీ పేర్కొన్నారు. ‘‘మన దగ్గర 500 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తలసరి వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం మూడింత ఒక వంతు పరిమాణంలోనే ఉన్నాం. వచ్చే 7–8 ఏళ్లలో ప్రపంచ సగటు తలసరి విద్యుత్ వినియోగానికి చేరుకోవాలంటే మరో 1,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అవసరం. చైనా స్థాయికి చేరుకోవాలంటే మరో 1,500 మెగావాట్ల సామర్థ్యం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలకు సమాన స్థాయికి చేరుకోవాలంటే మరో 2,500–3,000 మెగావాట్ల సామర్థ్యం అవసరం అవుతుంది’’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment