ఇండియన్ సెమీకండక్టర్ మిషన్(ఐఎస్‌ఎం) రెండో దశకు 10 బిలియన్ డాలర్లు(రూ.83 వేలకోట్లు) కేటాయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశీయంగా సెమీకండక్టర్ తయారీ, ప్యాకేజింగ్, డిజైనింగ్ కోసం ఈ నిధులను ఉపయోగించబోతున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. టవర్ సెమీకండక్టర్, అదానీ గ్రూప్ సంయుక్తంగా చిప్ తయారీ ప్లాంట్‌ను తయారు చేయాలని ప్రతిపాదించాయి. అందుకోసం ఈ నిధుల్లో కొన్నింటిని వాడుకోనున్నట్లు తెలిసింది.
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్‌సోర్స్‌డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్‌ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: మూడు గనుల్లో 40,560 మందికి ఉపాధి
ఐఎస్‌ఎం రెండో దశలో భాగంగా రూ.83 వేలకోట్ల ప్రోత్సాకాలు అందించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన టవర్ సెమీకండక్టర్ సంస్థ, అదానీ గ్రూప్ సంయుక్తంగా మెగా సెమీకండక్టర్ చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను సిద్ధం చేయాలని యోచిస్తున్నాయి. ఈమేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే టాటా గ్రూప్ సెమీకండక్టర్ల ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment