అవన్నీ అబద్దాలే.. హిండెన్‌బర్గ్ ఆరోపణపై అదానీ గ్రూప్ | Adani Group Unequivocally Reject Hindenburg New Allegations | Sakshi
Sakshi News home page

అవన్నీ అబద్దాలే.. హిండెన్‌బర్గ్ ఆరోపణపై అదానీ గ్రూప్

Published Fri, Sep 13 2024 11:18 AM | Last Updated on Fri, Sep 13 2024 11:39 AM

Adani Group Unequivocally Reject Hindenburg New Allegations

అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న 310 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను స్విస్ అధికారులు స్తంభింపజేసారని ఆరోపించింది. ఈ ఆరోపణలను నిరాధారమని సంస్థ తిరస్కరించింది.

స్విస్ కోర్టు విచారణలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని, అలాగే కంపెనీ ఖాతాలు ఏ అధికారం ద్వారా సీక్వెస్ట్రేషన్‌కు గురికాలేదని 
అదానీ గ్రూప్ పేర్కొంది. తమ మార్కెట్ విలువను తగ్గించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించింది. మా విదేశీ హోల్డింగ్ నిర్మాణం పారదర్శకంగా, పూర్తిగా బహిర్గతం జరుగుతోంది. అంతే కాకుండా సంస్థ సంబంధిత చట్టాలకు అనుగుణంగా ఉందని వివరించింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్దాలనీ.. అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఇది మా పరువును, మార్కెట్ విలువను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర అని వివరించింది.

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 1.1 లక్షల ఉద్యోగాలు

అదానీ గ్రూప్‌పైన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జనవరిలో కూడా 106 పేజీల నివేదికలను విడుదల చేసి.. అదానీ గ్రూప్‌లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ విలువ భారీగా తగ్గిపోయింది. ఈ ప్రభావంతో అదానీ సంపద ఏకంగా 60 బిలియన్ డాలర్ల వరకు తగ్గిపోయింది. ఆ తరువాత కంపెనీ షేర్స్ క్రమంగా పెరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement