సాక్షి, తాడేపల్లి: సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంతో డబ్బు ఆదా అవుతుందని.. తక్కువ రేటు కోసమే తాము టెండర్లు పిలిచామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్డీటీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, ‘‘మా ప్రభుత్వం ఉద్దేశం తక్కువ ధరకు విద్యుత్ సేకరించడమేనని.. సాధారణంగా విద్యుత్ సేకరణ ఛార్జీ రూ.5.10గా ఉంది. సెకీతో ఒప్పందంతో రాష్ట్రానికి ఎంతో ఖర్చు తగ్గింది’’ అని వివరించారు.
‘‘మేం ముందుగా 6,400 మెగావాట్ల విద్యుత్‌కు టెండర్లు పిలిచాం. కొందరి కారణంగా అది కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. దాదాపు 10 నెలల తర్వాత సెకీ నుంచి మాకు లేఖ వచ్చింది. ఆ టెండర్లలో కోట్ చేసిన అమౌంట్‌కే విద్యుత్ ఇచ్చేందుకు సెకీ ఒప్పుకుంది. రూ.2.49కే యూనిట్ విద్యుత్ సఫ్లై చేసేందుకు అంగీకరించింది. అంతేకాదు స్పెషల్ ఇంటెన్సివ్ కూడా ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు లేకుండా విద్యుత్ ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది.’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇంత తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేయడం ఇదే ప్రథమం.. అంత మంచి మంచి అవకాశాన్ని ఏ ప్రభుత్వమైనా వదులుకుంటుందా?. కేంద్ర ఆధీనంలో సెకీ ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించాం. పెట్టుబడి పెట్టాలనుకునే ఎవరైనా సరే సీఎంను కలుస్తారు కదా.. ఇలాంటి విషయాల్లో సీఎం ముందుకు రాకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు.
..2019 నుంచి నా పదవీ కాలం ముగిసే వరకు నేను గౌతమ్ అదానీని ఐదారు సార్లు కలిశా. కేవలం ఆగస్టులో కలిసిన విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు. ఆగస్టు తర్వాత అంతకుముందు కూడా చాలాసార్లు కలిశా. ఆయన్నే కాదు.. చాలామంది వ్యాపారవేత్తలతో భేటీ అయ్యాను. సీఎంగా అది నా బాధ్యత.. విధుల్లో ఒక భాగం’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment