
ఆదాయం, ఇబిటా పురోగతిపై బ్రోకరేజీ అంచనాలు
న్యూఢిల్లీ: విద్యుత్ ప్రసార కంపెనీ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 18.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,54,660 కోట్లు) ఎంటర్‌ప్రైజ్ విలువను సాధించినట్లు బ్రోకరేజీ కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ పేర్కొంది. పటిష్ట వృద్ధిలోనున్న బిజినెస్ కారణంగా కంపెనీ ఆదాయం, పన్నుకుముందు లాభాల్లో భారీ పురోగతికి వీలున్నట్లు అంచనా వేసింది.
రానున్న మూడేళ్లలో ఆదాయం వార్షిక ప్రాతిపదికన 20 శాతం, పన్నుకుముందు లాభాలు 29 శాతం చొప్పున పుంజుకోగలవని అభిప్రాయపడింది. కంపెనీ విద్యుత్ ప్రసారం, పంపిణీ ఆస్తులతోపాటు.. స్మార్ట్ మీటరింగ్ బిజినెస్‌లను కలిగి ఉంది. మూడేళ్ల(2024 నుంచి 2027) కాలంలో వార్షిక ప్రాతిపదికన ఆదాయం 20 శాతం, నిర్వహణ లాభం(ఇబిటా) 29 శాతం చొప్పున పురోగమించనున్నట్లు కాంటర్ ఫిట్జ్ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment