సూచీ నుంచి విప్రో ఔట్
అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో నమోదుకానుంది. ఐటీ సంస్థ విప్రో ఈ జాబితా నుంచి బయటకువెళ్లనుంది. సెన్సెక్స్ 50 సూచీలో టాటా గ్రూప్‌కు చెందిన ట్రెంట్ లిమిటెడ్ చేరింది. ఈ సూచీలో నుంచి దివీస్ బయటకు వెళ్లింది. ఈ మేరకు ఎస్‌అండ్‌పీ డౌజోన్స్ సూచీ, బీఎస్‌ఈ జాయింట్ వెంచర్ ఆసియా ఇండెక్స్ ప్రకటిన విడుదల చేశాయి. ఈ మార్పులు జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయి.
అదానీ గ్రూప్ కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ సెన్సెక్స్ 30 సూచీలోకి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కానీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు ఆ అవకాశం దక్కింది. ఏడాది కాలంగా ఈ కంపెనీ షేర్లు స్థిరంగా రాణిస్తుండడంతో ఈ అవకాశం దక్కినట్లు తెలిసింది. అదానీ కంపెనీల్లో సెన్సెక్స్ 30 సూచీలో చోటు దక్కించుకున్న తొలి కంపెనీ అదానీ పోర్ట్స్ కావడం విశేషం.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్‌ను 1998లో స్థాపించారు. అహ్మదాబాద్ కేంద్రంగా దేశంలోని వివిధ పోర్ట్‌లను ఆపరేట్ చేసే లాజిస్టిక్స్ కంపెనీగా ఎదిగింది. దేశవ్యాప్తంగా 12 పోర్ట్‌లు, టెర్మినల్స్ ఈ సంస్థ పరిధిలో పనిచేస్తున్నాయి. ఇందులో దేశంలోనే మొట్టమొదటి డీప్ వాటర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ తిరువనంతపురం, ముంద్రాలోని పోర్ట్ సెజ్ ప్రధానమైనవి. ఈ కింది పోర్ట్‌లు అదానీ పోర్ట్ అండ్ సెజ్‌లో భాగంగా ఉన్నాయి.
విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం తిరువనంతపురం
ముంద్రా పోర్టు
కృష్ణపట్నం ఓడరేవు
కారైకాల్ పోర్టు
హజీరా పోర్టు
ధమ్రా పోర్టు
దహేజ్ పోర్టు
గంగవరం ఓడరేవు
వైజాగ్ టెర్మినల్
మోర్ముగో టెర్మినల్
కట్టుపల్లి ఓడరేవు
కామరాజర్ పోర్టు
ట్యూనా టెర్మినల్
అగర్దానా షిప్‌యార్డ్ & టెర్మినల్స్
డిఘి పోర్టు
Comments
Please login to add a commentAdd a comment