ఢిల్లీలో కలకలం.. పార్లమెంట్‌లోకి చొరబడేందుకు.. | Three Arrested For Using Forged Aadhaar Cards To Enter Parliament | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కలకలం.. పార్లమెంట్‌లోకి చొరబడేందుకు..

Published Fri, Jun 7 2024 9:10 AM | Last Updated on Fri, Jun 7 2024 9:37 AM

Three Arrested For Using Forged Aadhaar Cards To Enter Parliament

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఖసిం, మోనిస్‌, షోయాబ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గేట్ నెంబర్ 3 నుంచి లోనికి వెళ్లేందుకు యత్నించగా.. అనుమానం రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది అరెస్ట్‌ చేశారు.

పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని స్టేషన్ కు తరలించి.. విచారిస్తున్నారు. ఈ రోజు ఢిలీలో పలు కీలక సమావేశాలు, ఎంపీలతో ఎన్డీఏ కూటమి సమావేశాలు ఉన్న ఈ క్రమంలో అధికారులు అప్రమత్తం అయ్యారు.  పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement