బ్రిటన్ పార్లమెంట్ రద్దైంది. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా పార్లమెంట్‌ను గురువారం రద్దు చేశారు. ఇక, పార్లమెంట్ రద్దుతో ఐదు వారాల ఎన్నికల ప్రచారం నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. దీంతో, నేటి నుంచి ఎన్నికల ప్రచారం షురూ కానుంది.
కాగా, జూలై నాలుగో తేదీన ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 23న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ వద్ద సునాక్ ఎన్నికల తేదీపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సునాక్ మాట్లాడుతూ..‘ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలను సాధించాం. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చింది’ అంటూ కామెంట్స్ చేశారు.
#BreakingNews #Updates #ukpolitics#British Parliament is formally dissolved ahead of July 4 general #election which polls indicate #Labour is expected to win over ruling #Conservative party pic.twitter.com/Lubf43M6r4
— Tanveer Roomi (@TanveerRoomi) May 30, 2024
ఇక బ్రిటన్ పార్లమెంట్‌లో మొత్తం 650 మంది సభ్యులు ఉన్నారు. కాగా, గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి దాదాపు 129 మంది ఎంపీలు పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment