
సాక్షి, తూర్పుగోదావరి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వెంటనే క్షమాపణలు చెప్పాలని మాదిగ రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న డిమాండ్ చేశారు. శనివారం కాకినాడలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఏపీలో మందకృష్ణను తిరుగనివ్వబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మాదిగలకు సీఎం జగన్ సముచిత స్ధానం కల్పించారని పేర్కొన్నారు. వర్గీకరణ ముసుగులో మాదిగలను అడ్డుపెట్టుకుని ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన ఘనత మందకృష్ణదే అని హేళన చేశారు. మందకృష్ణ కుట్రలను గ్రామగ్రామాలకు తీసుకువెళ్తామని తెలిపారు.