ప్రధాని మోదీతో మంద కృష్ణ భేటీ | Manda Krishna met PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో మంద కృష్ణ భేటీ

Published Sat, Aug 10 2024 2:40 AM | Last Updated on Sat, Aug 10 2024 2:40 AM

Manda Krishna met PM Narendra Modi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో మోదీని కలిసిన మందకృష్ణ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు అరగంటపాటు మోదీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవడంలో మోదీ వంద శాతం విజయం సాధించారన్నారు.

రెండు రాష్ట్రాల్లో వర్గీకరణ త్వరితగతిన అమలయ్యేలా చూడాలని కోరారు. కొందరు వర్గీకరణ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, కాబట్టి ఏపీ, తెలంగాణలో సమస్య ఉత్పన్నం కాకుండా అమలు జరిగేలా చూడాలని విన్నవించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి మోదీ మాత్రమేనని మంద కృష్ణ కొనియాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement