రేవంత్‌ Vs ఉత్తమ్‌: గాంధీభవన్‌లో మాటల వార్‌ | Congress Leaders Exchange Of Words In Seat Allocations At Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌ వేదికగా కాంగ్రెస్‌లో పొలిటికల్‌ వార్‌.. హైకమాండ్‌ రియాక్షన్‌? 

Published Tue, Aug 29 2023 9:17 PM | Last Updated on Tue, Aug 29 2023 9:40 PM

Congress Leaders Exchange Of Words In Seat Allocations At Gandhi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య గాంధీ భవన్‌ వేదికగా వాడీవేడి మాటల యుద్ధం నడుస్తోంది. సీట్ల విషయంలో పీఈసీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నట్టుగా చర్చ వేడెక్కింది. కొన్నిచోట్ల రెండు, మరికొన్న చోట్ల 20కిపైగా దరఖాస్తులు ఎలా వచ్చాయని సీనియర్లు నిలదేశారు. 

► ఈ సమావేశంలో ఒకే కుటుంబానికి రెండు సీట్ల అంశం ప్రస్తావన రావడంతో మహేష్‌ గౌడ్‌, ఉత్తమ్‌కుమార్‌ మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. ఈ సందర్భంగా రెండుసీట్ల చర్చ ఇప్పుడు ఎందుకు అన్ని ప్రశ్నించారు. ఎవరిని టార్గెట్‌ చేసి చర్చ చేస్తున్నారంటూ ఉత్తమ్‌ సీరియస్‌ అయ్యారు. 

► ఇదే సమయంలో ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశం హైకమాండ్‌ చూసుకుంటుందన్నారు. దీంతో, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ హైకమాండ్‌కు చెప్పాలని ఉత్తమ్‌ అన్నారు. నన్ను డిక్టేట్‌ చేయవద్దని రేవంత్‌ సూచించారు. 

► జగ్గారెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక మీద చర్చ జరిగింది. ఇది మొదటి సమావేశం మాత్రమే. ఆ రెండు సీట్ల మీద అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సర్దిచెప్పాం. 

భేటీలోని అంశాలు ఇవే.. 
 బీసీలకు ఎన్ని నియోజకవర్గాలు ఇస్తారో, ఎక్కడెక్కడ ఇస్తారో తేల్చాలన్న వీహెచ్‌

► మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చేది ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించిన  రేణుకా చౌదరి. అలాగే, పీఈసీలో ఒక్కో సభ్యుడు ఒక మహిళా అభ్యర్థిని సిఫార్సు చేయాలన్నారు. 

► సర్వేలపై మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్‌ సీరియస్‌ అయ్యారు. సర్వే ఆధారంగా టికెట్లు ఇచ్చేటప్పుడు ఈ ప్రక్రియ ఎందుకని నిలదీశారు. సర్వేలను ఏ ప్రాతిపదికన చేస్తున్నారో చెప్పాలన్నారు. 

ఇది కూడా చదవండి: ఎన్నికల్లో పోటీపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. నల్గొండ సీటు ఎవరికి?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement