సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడినవారు.. స్థానిక ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్న బీఆర్‌ఎస్‌నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌లో కసరత్తు కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజే కాంగ్రెస్ ఈ ఆపరేషన్ మొదలుపెట్టగా, త్వరలోనే సత్ఫలితాలు వస్తాయని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే..ఎవరితో చర్చిస్తున్నారు? ఎక్కడ కలిసి మాట్లాడుతున్నారు? ఎవరు డీల్ చేస్తున్నారు? అనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఈ నెల 26న చేవెళ్లలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో భారీఎత్తున ఇత ర పార్టీల నుంచి నాయకులను చేర్చుకునేందు కు టీపీసీసీ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల సభలోభారీగా చేరికలుంటాయని కాంగ్రెస్‌పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీతా దయాకర్‌రెడ్డి ఇంటికి మల్లురవి
టీడీపీ సీనియర్ మహిళానేత, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డిని పార్టీలోకి రావాలని కాంగ్రెస్ ఆహా్వనించింది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి తదితరులు బుధవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి ఈ మేరకు ఆహా్వనించారు. సీతా దయాకర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
జూబ్లీహిల్స్ టికెట్‌కు అజహరుద్దీన్ దరఖాస్తు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీం ఇండియా మాజీ కెపె్టన్ అజహరుద్దీన్ బుధవారం దరఖాస్తు చేసుకున్నారు.
500 దాటిన దరఖాస్తులు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తులు పెద్ద సంఖ్యలో సమర్పిస్తున్నారు. ఈ నెల18న దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా, మంగళవారం వరకు 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. బుధవారం ఒక్కరోజే 200 దరఖాస్తులు వచ్చాయని, దీంతో ఆ సంఖ్య 500 దాటిందని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
♦ నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం దరఖాస్తు చేసుకున్నారు.
♦ మాజీమంత్రి కొండా సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డిలు కూడా త మ దరఖాస్తులను గాం«దీభవన్‌లో ఇచ్చారు.
♦ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తోపాటు 10 మంది మహిళానేతలు బుధవారం టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment