Updates..
► ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పీఈసీ ఎంపిక చేసిన జాబితాను సీల్డ్ కవర్‌లో స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తాం. మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌లోనే ఉంటుంది. రేపు పీఈసీ సభ్యులతో వేర్వేరుగా సమావేశమై కమిటీ అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఎల్లుండి డీసీసీ అధ్యక్షులతో భేటీ అయ్యి అభిప్రాయాలను తెలుసుకోనుంది.
► సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ జాబితాను నివేదిస్తుంది. వీలైనంత తర్వలో మొదటి విడత జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే జాబితానే ఫైనల్. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నాకు కూడా సమాచారం ఉండదు. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఈసారి అభ్యర్థులలో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయబోతున్నారు. అభ్యర్థుల ఎంపికలో మీరు అపోహలకు గురికావాల్సిన అవసరం లేదు.
► ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది.
► ఈనెల 7న హైదరాబాద్‌కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో హైదరాబా్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేసీ హైదరాబాద్‌కు రానున్నారు. సమావేశాల ఏర్పాట్లపై టీపీసీసీ నేతలతో సమీక్ష చేయనున్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే గాంధీభవన్‌లో ఆదివారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. పీఈసీ ఛైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది.
► ఆశావహుల వ్యక్తిగత పూర్తి సమాచారాన్ని పీఈసీ సభ్యులకు అందజేశారు. 1.006 దరఖాస్తులను పీఈసీ సభ్యులు స్క్రూట్నీ చేయనున్నారు. ఇప్పటికే 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. మిగతా 94 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇక, పీఈసీ ఇచ్చే నివేదికను రేవంత్ రెడ్డి.. స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టనున్నారు.
► రేపటి నుంచి మూడు రోజుల పాటు పీఈసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్లతో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు విడివిడిగా చర్చలు జరుపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment