
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తమకు తగిన ప్రాధాన్యమివ్వాల్సిందేనని కాంగ్రెస్ బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోమా రు తమ గళాన్ని వినిపించేందుకు ఆదివారం కాంగ్రెస్ బీసీ నేతలు గాందీభవన్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నా ల లక్ష్మయ్య, మధుయాష్కీగౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్‌కుమార్ గౌడ్, సురేశ్ షట్కార్, పొన్నం ప్రభాకర్, కొండా మురళీ, సురేఖ, ఎర్ర శేఖర్ తదితరులు హాజరవుతారని ఏఐసీసీ ఓబీసీ విభాగం జాతీయ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి శనివారం విలేకరులకు తెలిపారు.
ఈసారి ఎన్నికల్లో లోక్‌సభ నియోజకవర్గానికి రెండు స్థానాలు చొప్పున 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం బీసీ నేతల జాబితాను టీపీసీసీ రూపొందించింది. ఈ జాబితాలో 40–42 మంది పేర్లుండగా, ఇందులో కనీసం 34 మందికి క చ్చితంగా టికెట్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఇటీవల జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో చర్చించిన అనంతరం 10 మంది పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని, మిగిలిన పేర్లపై తదుపరి సమావేశాల్లో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
స్క్రీనింగ్ కమిటీ పరిశీలన కోసం ప్రతిపాదించిన పేర్లు ఇవీ...
పొన్నాల లక్ష్మయ్య (జనగామ), కొండా సురేఖ (పరకాల), మధుయాష్కీగౌడ్ (ఎల్బీనగర్), అంజన్‌కుమార్ యాదవ్ (ముషీరాబాద్), పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్), సురేశ్ షెట్కార్ (నారాయణఖేడ్), ఈరవత్రి అనిల్ (బాల్కొండ), ఎర్ర శేఖర్ (జడ్చర్ల), ఆది శ్రీనివాస్ (వేములవాడ), బి. మహేశ్‌కుమార్ గౌడ్ (నిజామాబాద్ అర్బన్), గండ్రత్ సుజాత (ఆదిలాబాద్), కాసుల బాలరాజు (బాన్సువాడ), కత్తి వెంకటస్వామి (వరంగల్ ఈస్ట్), నందికంటి శ్రీధర్ (మల్కాజ్‌గిరి), పోతంశెట్టి వెంకటేశ్ (భువనగిరి), కాటా శ్రీనివాస్ (పఠాన్‌చెరు), గాలి అనిల్‌కుమార్ (నర్సాపూర్), అనిల్ కుమార్ యాదవ్ (ముషీరాబాద్), మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ (రామగుండం), ఎ. సంజీవ్ (మహబూబ్‌నగర్), కాటం ప్రదీప్‌కుమార్ (దేవరకద్ర), వాకిటి శ్రీహరి (మక్తల్), వీర్లపల్లి శంకర్ (షాద్‌నగర్), కడెంపల్లి శ్రీనివాస్ (షాద్‌నగర్), ఎం.వేణుకుమార్ (రాజేంద్రనగర్), ఎడవల్లి కృష్ణ (కొత్తగూడెం), నాగ సీతారాములు (కొత్తగూడెం), బీర్ల అయిలయ్య (ఆలేరు), నేరెళ్ల శారద (కరీంనగర్), జె.జైపాల్ (శేరిలింగంపల్లి), ఆనందరావు పాటిల్ (ముధోల్), అంబటి రాజేశ్వర్ (నిర్మల్), ఎం.చంద్రశేఖర్‌గౌడ్ (నిజామాబాద్ రూరల్), ఆంజనేయు లు (నర్సాపూర్), కత్తి కార్తీక (దుబ్బాక), నగేశ్ ముదిరాజ్, సంగిశెట్టి జగదీశ్వరరావు (ముషీరాబాద్), మెట్టు సాయికుమార్ (గో షామహల్), లక్ష్మణ యాదవ్ (అంబర్‌పేట), ధర్మపురి సంజయ్ (నిజామాబాద్ అర్బన్).