మాజీ ఎంపీల భేటీ అంటూ రోజంతా హడావుడి  | Congress Party campaign former MPs meet | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీల భేటీ అంటూ రోజంతా హడావుడి 

Published Mon, Jun 19 2023 1:29 AM | Last Updated on Mon, Jun 19 2023 7:13 AM

Congress Party campaign former MPs meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన సమయంలో ఎంపీలుగా ఉన్న పలు పార్టీలకు చెందిన నాయకులు ఆదివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కోసం భేటీ అవుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. హైదరాబాద్‌ వేదికగా ఈ సమావేశం జరగనుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడం, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎంపీలంతా భేటీ అవుతున్నారని వార్తలు షికార్లు చేయడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగానే ఈ సమావేశం జరుగుతోందని... ఈ భేటీ కోసం పలువురు కాంగ్రెస్‌ మాజీ ఎంపీలకు ఆహ్వానాలు సైతం అందాయనే చర్చ గాంధీ భవన్‌ వర్గాల్లో జరిగింది. అయితే చివరి క్షణంలో ఈ భేటీ రద్దయినట్లు సమాచారం. ఈ సమావేశం గురించి ఓ మాజీ ఎంపీ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము కలుద్దామని అనుకున్న మాట వాస్తవమేనని, అయితే అందరికీ ఆహ్వానాలు అందాయో లేదో తెలియదన్నారు.

కొందరికి మాత్రం ఫోన్లు వచ్చాయని చెప్పారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, సమయం వచ్చినప్పుడల్లా తాము కలుస్తుంటామని, అప్పుడప్పుడూ కలసి రాజకీయాలు మాట్లాడుకుంటుంటామని అన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటం, నేతల పార్టీల మార్పు గురించి చర్చ జరుగుతుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిందని వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement