కాపులను బీసీలుగా గుర్తించాల ని కోరుతూ ఆందోళన చేస్తున్న ముద్రగడ పద్మనాభం మద్దతుగా కాంగ్రెస్
మచిలీపట్నం టౌన్ : కాపులను బీసీలుగా గుర్తించాల ని కోరుతూ ఆందోళన చేస్తున్న ముద్రగడ పద్మనాభం మద్దతుగా కాంగ్రెస్ నాయకులు బుధ వారం డీసీసీ కా ర్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షను నిర్వహించారు. వారు మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కాపు రిజర్వేషన్‌ను క్లాజ్ 9 ప్రకారం బీసీలకు ఏ మాత్రం హాని కలగకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముద్రగడ దీక్ష వివరాలను తెలుపుతున్న మీడియాపై ఆంక్ష లు విధించడం అప్రజాస్వామికమన్నారు. ఈ రిలేదీక్ష లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌మతీన్, అవని గడ్డ నియోజక వర్గ ఇన్‌చార్జి మత్తి వెంకటేశ్వరరావు, నాయకులు డాక్టర్ ఎన్.రాధికామాధవి, దాదాసాహెబ్, ఆర్.ప్రసాద్, పి.నాగరాజు, షేక్ రబ్బానీ, కె.వెంకటేశ్వరరావు, ఎండీ మెహసీన్, బి.ఎర్రబాబు, అఖ్తర్, గౌస్‌షరీఫ్, ఖదీర్ పాల్గొన్నారు.
నేడు కాపు జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
కోనేరుసెంటర్ : కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపుల పక్షాన ప్రభుత్వంపై చే స్తున్న పోరాటానికి మద్దతుగా గురువారం మచిలీపట్నంలో కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు మ చిలీపట్నం కాపు జేఏసీ బుధవారం తెలిపింది. గురువారం సాయంత్రం 4 గంటలకు రేవతిసెంటర్‌లోని రంగా విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రభుత్వానికి కా పుల నిరసన తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాపు సోదరులంతా హాజరుకావాలని జేఏసీ పిలుపునిచ్చింది.