‘ముద్రగడను విమర్శించే అర్హత టీడీపీకి లేదు’ | congress leaders slams tdp over mudragada yatra | Sakshi
Sakshi News home page

‘ముద్రగడను విమర్శించే అర్హత టీడీపీకి లేదు’

Published Wed, Nov 16 2016 2:57 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ముద్రగడ దీక్షల వెనుక వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉన్నారని టీడీపీ నేతలు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

విజయవాడ: ముద్రగడ దీక్షల వెనుక వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉన్నారని టీడీపీ నేతలు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ముద్రగడను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర, టీడీపీ నాయకులు చేస్తున్న జన చైతన్య యాత్రలకు పోలీసుల అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చినా.. ప్రభుత్వం ముద్రగడ యాత్రను ఎందుకు అడ్డుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరహరి శెట్టి నరసింహరావు, పక్కల సూరిబాబు, ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement