‘ముద్రగడను చూస్తే బాబుకు జ్వరం’
Published Thu, Jul 27 2017 1:40 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
విజయవాడ: ముద్రగడను చూస్తే చంద్రబాబుకి జ్వరం పట్టుకుంటోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరహరి శెట్టి నర్సింహారావు ఎద్దేవ చేశారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని అమలు చేయలేకపోయారు. హామీలు అమలు చేయలేని బాబు ఉద్యమాలను అనగదొక్కేందుకు యత్నిస్తున్నారు.
హక్కుల కోసం పోరాడుతున్న కాపులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. కాపు మహిళలతో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉంది. కాపు ఉద్యమానికి మంత్రులు గంటా, చినరాజప్ప, నారాయణ వెన్నుపోటు పొడుస్తున్నారు. టీడీపీ కాపు ప్రజా ప్రతినిధులకు సిగ్గు ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement