కంచికచర్ల(కృష్ణా జిల్లా) :కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటిపల్లె గ్రామంలో డ్వాక్రా మహిళలు మంగళవారం మధ్యాహ్నం ఆందోళన చేశారు.ఇసుక రీచ్‌లను టీడీపీకి చెందిన డ్వాక్రా మిహళ లకే కేటాయిస్తున్నారని , న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన వాటాలు రావట్లేదని వైఎస్సార్‌సీపీకి చెందిన డ్వాక్రా మహిళలు ఆరోపించారు. వీరి ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.