
భయపడొద్దు: రాజన్
బ్రెగ్జిట్ నేపథ్యంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు.
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ నేపథ్యంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. తొలుత ఇన్వెస్టర్లలో ఆందోళన ఉన్నా... భారత్ మూలాలు పటిష్ఠంగా ఉన్న దృష్ట్యా తిరిగి దేశానికి పెట్టుబడులు వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో పోటీపడేందుకు ఏ దేశమూ తమ కరెన్సీ విలువను తగ్గించకూడదని సూచించారు. ‘‘కీలక పరిస్థితుల్లో ఏ దేశమూ రక్షణాత్మక చర్యలు తీసుకోకూడదు. మేమైతే అంతర్జాతీయ, దేశీ మార్కెట్లన్నిటినీ పరిశీలిస్తున్నాం. లిక్విడిటీ సమస్య రాకుండా చూస్తాం’’ అని బాసెల్ నుంచి ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ రాజన్ చెప్పారు. ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ నుంచి విదేశాలకు తరలిపోయే నిధులు తక్కువే ఉంటాయని పేర్కొన్నారు.